
ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రిలయ్సన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వారి కుటుంబంలో ఏ ఈవెంట్ జరిగినా అది పెద్ద చర్చ అవుతూనే ఉంటుంది.
అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇటీవలే రాధాకాతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ఆనంత్, రాధికా చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు, రాధికా ప్రముఖ వ్యాపార దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె.
న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ను రాధిక పూర్తి చేసింది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్‌లో సూమారు 60,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
Details
ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరక్టర్‌గా పనిచేసిన రాధికా
ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్‌లలో రాధికా ఇంటర్న్ షిప్ కూడా చేసింది.
తర్వాత కుటుంబ వ్యాపారమైన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరక్టర్‌గా ఆమె పనిచేసింది. ఆమె ఖరీదైన వస్తులు, దుస్తులు, హ్యాండ్ బ్యాగులతో తరుచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.
ఆమె వ్యక్తిగత సంపద విలువ రూ.8 నుంచి 10 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.
ఇక రాధిక మర్చంట్ తండ్రి వీరెన్ మర్చంట్ నికర విలువ దాదాపుగా రూ.755 కోట్లు ఉండనుంది.
అనంత్, రాధికా 2024 జూలై 10, 11, 12 తేదీల్లో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.