Petrol Diesel Price Hike Again: వాహనదారులకు భారీ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో భారీ షాక్ తగిలింది. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం (మే 23) నుంచి అమల్లోకి వచ్చేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను పెంచినట్లు ప్రకటించాయి. తాజా పెంపులో భాగంగా పెట్రోల్ లీటరుకు 87 పైసలు, డీజిల్ లీటరుకు 91 పైసలు పెరిగాయి. ఈ కొత్త ధరలు మే 23 ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.112.84కు చేరుకోగా, డీజిల్ ధర రూ.100.94కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
వివరాలు
90 పైసల మేర పెంపు
గత 10 రోజుల వ్యవధిలో దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇప్పటికే మే 15, 2026న చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. అప్పుడు దేశవ్యాప్తంగా ఇంధన ధరలపై లీటరుకు రూ.3 వరకు పెంపు విధించారు. ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ పెంపు ప్రభావం నుంచి వాహనదారులు ఇంకా కోలుకోకముందే, మే 19, 2026న మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 90 పైసల మేర పెరిగాయి.
వివిరాలు
సామాన్య ప్రజలపై అదనపు భారం
ఇప్పుడు మే 23న మరోసారి ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు, పెట్రోల్ డీజిల్ ధరల వరుస పెంపులు మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలపై ఆధారపడే మధ్యతరగతి, ఉద్యోగులు, రవాణా రంగానికి చెందినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.