Loading...
IIFL Finance Blackstone Deal: IIFL ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ డీల్‌.. 15 శాతం వాటాపై కన్ను
IIFL ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ డీల్‌.. 15 శాతం వాటాపై కన్ను

IIFL Finance Blackstone Deal: IIFL ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ డీల్‌.. 15 శాతం వాటాపై కన్ను

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్థిక సేవల రంగంలో మరో భారీ పెట్టుబడి ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ గ్లోబల్‌ పెట్టుబడి సంస్థ బ్లాక్‌ స్టోన్‌.. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (NBFC) అయిన IIFL ఫైనాన్స్‌లో 15 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకోసం 500-600 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4,400-5,300 కోట్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని Moneycontrol నివేదిక పేర్కొంది. మరో పెట్టుబడి సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కూడా ఈ ఒప్పందంపై ఆసక్తిగా ఉంది.

Details

సెప్టెంబర్‌ నుంచే చర్చలు.. త్వరలో నిర్ణయం

బ్లాక్‌స్టోన్‌, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌తో వాటాల కొనుగోలుపై చర్చలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి.

ఇటీవలి వారాల్లో ఈ ప్రక్రియ మరింత వేగం అందుకుంది. పెట్టుబడి పెట్టే సంస్థకు కంపెనీ బోర్డులో స్థానం కల్పించే ప్రతిపాదన లేదని సమాచారం.

ప్రస్తుతం కంపెనీ విలువ ఆధారంగా తుది లెక్కలు, ఒప్పంద వివరాలపై చర్చలు జరుగుతున్నాయి. నవంబర్‌ 10న IIFL ఫైనాన్స్‌ బోర్డు సమావేశమై మూలధన సమీకరణపై నిర్ణయం తీసుకోనుంది.

Details

కంపెనీ ఆదాయంలో భారీ వృద్ధి

IIFL ఫైనాన్స్‌ ఆర్థిక పనితీరు కూడా మెరుగుపడుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) రూ.1.24 లక్షల కోట్లకు చేరింది.

గత ఏడాదితో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధి. నికర ఆదాయం రూ.2,340 కోట్లుగా నమోదైంది. పన్నుల అనంతర లాభం (PAT) ఏకంగా 93 శాతం పెరిగి రూ.805 కోట్లకు చేరింది.

ADVERTISEMENT

Details

సురక్షిత రుణాలపై కంపెనీ దృష్టి

కంపెనీ రుణాల్లో దాదాపు 90 శాతం బంగారు రుణాలు, గృహ రుణాల వంటి సెక్యూర్డ్‌ లోన్లే ఉన్నాయి.

సెప్టెంబర్‌ 2026 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల (GNPA) నిష్పత్తి 1.5 శాతానికి తగ్గింది.

గత ఏడాది ఇదే సమయంలో ఇది 2.1 శాతంగా ఉంది. మూలధన సమృద్ధి నిష్పత్తి 23.5 శాతంగా నమోదైంది.

కొత్త పెట్టుబడి ఖరారైతే రిటైల్‌ రుణ వ్యాపార విస్తరణకు IIFLకు మరింత ఆర్థిక బలం చేకూరనుంది.

ADVERTISEMENT