Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో సానుకూలతను తీసుకొచ్చాయి.
దీనితో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ట్రేడింగ్‌లో ఓ దశలో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరిగి, నిఫ్టీ 22,400 మార్కును చేరువైంది.
చివరికి నిఫ్టీ 22,350కు సమీపంలో స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం 2 శాతం మేర లాభపడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 73,005.37 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 72,989.93) లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 73,933.80 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద ముగిసింది.
Details
లాభాల్లో మారుతీ సుజుకీ, జొమాటో షేర్లు
నిఫ్టీ 255.80 పాయింట్లు పెరిగి 22,338.45 వద్ద స్థిరపడింది. డాలరుతో మారకం విలువలో రూపాయి 23 పైసలు బలపడి 86.96 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో, మారుతీ సుజుకీ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి.
అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.52 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2929 డాలర్ల వద్ద కొనసాగుతోంది.