Page Loader
TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్ 
లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్

TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్ 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)ను లంచాలకు ఉద్యోగాల స్కామ్ కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన 16 మందిపై వేటు వేసినట్లు టీసీఎస్ ప్రకటించింది. అలాగే టీసీఎస్‌తో వ్యాపారం చేస్తున్న ఆరుగురు విక్రేతలను కూడా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు టీసీఎస్‌ వివరించింది. లంచాలకు ఉద్యోగాల స్కామ్ మొత్తం 19 మంది పాత్ర ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 16మందిని తొలగించగా, ఇంకో ముగ్గురిని బదిలీ చేసింది. ఈ కుంభకోణంపై టీసీఎస్ స్పందించింది. ఇందులో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని స్పష్టం చేసింది. కుంభకోణానికి, కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

టీసీఎస్

ఇటీవల నివేదికను సమర్పించిన కమిటీ

విక్రేతలతో కలిసి కొత్త ఉద్యోగుల నియామకాల్లో కొందరు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు 2023 జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కంపెనీ నిఘా విభాగం వెంటనే దర్యాప్తు చేపట్టగా, అవకతవకలు జరిగిన విషయం వాస్తవమే అని తేలింది. ఈ స్కామ్‌కు సంబంధించి లోతైన విచారణకు ఒక కమిటీని కూడా నియమించింది. ఈ వ్యవహారంపై దాదాపు నాలుగు నెలల పాటు కమిటీ దర్యాప్తు జరిపింది. ఇటీవల కమిటీ నివేదికను సమర్పించగా, వెంటనే కంపెనీ చర్యలు చేపట్టింది.