LOADING...
GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.9% పెరుగుతుంది.. వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్..!
వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్..!

GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.9% పెరుగుతుంది.. వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

డెలాయిట్‌ ఇండియా భారత ఆర్థిక పరిస్థితులపై ఆశాజనక వృద్ధి అంచనాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ GDP 6.7 నుంచి 6.9 శాతం మధ్య పెరుగుతుందని డెలాయిట్ అంచనా వేసింది. ఈ అంచనాకు ప్రధాన కారణంగా దృఢమైన స్థానిక డిమాండ్, GST 2.0 వంటి విధానపరమైన మార్పులు పేర్కొన్నారు. డెలాయిట్ పూర్వపు అంచనాకు 0.3 శాతం పాయింట్ల పెరుగుదల ఇది, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) FY26 ఆర్థిక వృద్ధి అంచనాకు (6.8%) సమానం.

ఆర్థిక దృక్పథం 

పండుగ త్రైమాసికంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుంది 

డెలాయిట్‌ ఇండియా 'ఇండియా ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదిక ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, వృద్ధి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వృద్ధి రేటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వ్యాపార, పెట్టుబడి పరిస్థితుల అనిశ్చితి కారణంగా కొంత భిన్నత ఉంటుందని సూచించారు. డెలాయిట్‌ ఇండియాలోని ఆర్ధిక నిపుణుడు రుంకి మజుమ్దార్, పండుగల క్వార్టర్‌లో వినియోగదారుల ఖర్చులు పెరుగుతాయని, తద్వారా ప్రైవేట్ పెట్టుబడులు కూడా బలంగా ఉంటాయని చెప్పారు.

ట్రేడ్ అంచనాలు 

అంతర్జాతీయ పరిస్థితులు వృద్ధికి సవాళ్లు

అయితే, అంతర్జాతీయ పరిస్థితులు వృద్ధికి సవాళ్లు ఇస్తున్నాయని మజుమ్దార్ తెలిపారు. సంవత్సరాంతానికి భారత్ యూఎస్,యూరోపియన్ యూనియన్‌లతో ఒక వ్యాపార (ట్రేడ్) ఒప్పందం పూర్తి చేయనుంది, ఇది పెట్టుబడుల వాతావరణాన్ని (ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్) బలపరుస్తుంది "మొదటి,మూడవ క్వార్టర్లలో బలమైన వృద్ధి మొత్తం వార్షిక వృద్ధిని ఆధారపెడుతుంది" అని ఆయన పేర్కొన్నారు. కానీ, అంతర్జాతీయ అంతరాయం, వ్యాపార అనిశ్చితులు, అమెరికాతో ట్రేడ్ డీల్‌ సాధించలేనట్ట పరిస్థితులు ఈ ఆర్థిక సంవత్సర వృద్ధిని ప్రభావితం చేయవచ్చని హెచ్చరించారు.

ద్రవ్యోల్బణం ఆందోళనలు 

గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు కఠినతరం

కోర్ ఇన్‌ఫ్లేషన్‌ స్థిరంగా 4% పైగా ఉండటం కూడా ఆర్థిక వృద్ధికి సవాలు అని మజుమ్దార్ చెప్పారు. ఇది RBI రేట్లను తగ్గించడంలో పక్కా అడ్డంకి అవుతుంది. "అంతేకాక, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ పొలిసీ రేట్లను ఎక్కువకాలం స్థిరంగా ఉంచితే, గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు కఠినతరం కావచ్చు" అని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంగా భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుండి పెట్టుబడులు బయటకు రావచ్చు, ఇది గత కొన్ని నెలలలో ఇప్పటికే కనిపిస్తున్న పరిస్థితి అని తెలిపారు.