Loading...
Passport Index Ranking: పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: ప్రపంచంలో టాప్‌లో యూఏఈ.. భారత్ ర్యాంకు ఇదే..
పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: ప్రపంచంలో టాప్‌లో యూఏఈ.. భారత్ ర్యాంకు ఇదే..

Passport Index Ranking: పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: ప్రపంచంలో టాప్‌లో యూఏఈ.. భారత్ ర్యాంకు ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌లకు ఉన్న అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను అంచనా వేసే 'పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026'లో భారత్ ర్యాంకు దిగజారింది. తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌ పోర్ట్ 73వ స్థానంలో నిలిచింది. గతేడాది 66వ ర్యాంకులో ఉన్న భారత్.. ఈసారి ఏకంగా ఏడు స్థానాలు కోల్పోయింది. మరోవైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్ చివరి స్థానంలో నిలిచి, అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌గా నమోదైంది.

వివరాలు 

ర్యాంకింగ్స్ కోసం మొత్తం 199 దేశాల పాస్‌పోర్ట్‌ల విశ్లేషణ 

ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను 'ఆర్టన్ క్యాపిటల్' సంస్థ రూపొందిస్తుంది. ఆయా దేశాల పౌరులు వీసా లేకుండా ప్రయాణించగలిగే దేశాలు, వీసా ఆన్ అరైవల్ సౌకర్యం పొందగలిగే దేశాల సంఖ్య ఆధారంగా 'మొబిలిటీ స్కోర్' (ఎంఎస్‌)ను కేటాయిస్తారు.

ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే ఆ దేశ పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయంగా ప్రయాణ స్వేచ్ఛ ఎక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ర్యాంకింగ్స్ కోసం మొత్తం 199 దేశాల పాస్‌పోర్ట్‌లను విశ్లేషించారు.

వివరాలు 

భారత్ పాస్‌పోర్ట్ పరిస్థితి ఏమిటి?

భారత పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం 69 మొబిలిటీ స్కోర్ ఉంది.

దీంతో భారత్.. జింబాబ్వే, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, వియత్నాం దేశాలతో కలిసి 73వ స్థానాన్ని పంచుకుంటోంది.

భారత పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు 25 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. మరో 39 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది.

అయితే, 129 దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా పొందడం తప్పనిసరి.

గతేడాదితో పోలిస్తే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల సంఖ్య తగ్గింది.

దీంతో భారత మొబిలిటీ స్కోర్ 73 నుంచి 69కి పడిపోయింది. ర్యాంకు దిగజారడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

అగ్రస్థానంలో యూఏఈ.. చివర్లో ఆఫ్ఘనిస్థాన్

పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో యూఏఈ 181 మొబిలిటీ స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

యూఏఈ పౌరులు 138 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మరో 43 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది.

కేవలం 17 దేశాలకు వెళ్లేందుకు మాత్రమే ముందస్తు వీసా అవసరం.

ఇక ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్ 35 మొబిలిటీ స్కోర్‌తో 99వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌గా అది నమోదైంది.

ఆఫ్ఘన్ పౌరులు 163 దేశాలకు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు వీసా తీసుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌పై కేంద్రం వైఖరి

అయితే, ఇలాంటి అంతర్జాతీయ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌ను భారత ప్రభుత్వం అధికారిక ప్రమాణంగా పరిగణించడం లేదు.

కొన్ని ప్రైవేట్ సంస్థలు తమకు తాముగా నిర్ణయించుకున్న ప్రమాణాల ఆధారంగా ఈ నివేదికలను రూపొందిస్తున్నాయని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఈ అంశంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గత జులై 31న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

పాస్‌పోర్ట్‌లకు ర్యాంకులు కేటాయించేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించిన ప్రమాణాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అందువల్ల ఏదైనా ఒక ర్యాంకింగ్ వ్యవస్థను ప్రామాణికంగా పరిగణించలేమని పేర్కొంది.

ADVERTISEMENT