IndiGo: ఇండిగో మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమాన సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో తన అంతర్జాతీయ సేవలను విస్తరిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌లకు నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
2030 నాటికి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థగా ఎదగడంతో పాటు, ఐరోపా దేశాలను భారత్‌తో మరింత బలంగా అనుసంధానించేందుకు ఈ విమాన సర్వీసులు కీలకంగా మారుతాయని కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
మాంచెస్టర్ (బ్రిటన్), ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్) నగరాలకు భారతదేశంలోని వివిధ నగరాల నుంచి వారానికి మూడుసార్లు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఇండిగో ప్రకటించింది.
వివరాలు
సాంకేతిక సమస్యతో వెనక్కి తిరిగిన ఎయిరిండియా విమానం!
షికాగో నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం సాంకేతిక సమస్య ఎదురైంది, దీంతో అది తిరిగి షికాగోకే వెళ్లాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 10 గంటల పైగా గడిచిన తర్వాత ఈ సమస్య తలెత్తింది.
విమానంలోని 10 మరుగుదొడ్లలో ఒకటి మినహా మిగతావన్నీ పనిచేయకుండా పోవడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
షికాగో చేరుకున్న అనంతరం ప్రయాణికులు, సిబ్బందికి తగిన వసతి ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి స్పష్టంచేశారు.