IndiGo: ఆదాయం పెరిగినప్పటికీ ఇండిగో క్యూ3 నికర లాభంలో 18 శాతం క్షిణించింది
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో (IndiGo) అనే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ తమ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) సంస్థ ఏకీకృత ప్రాతిపదికన రూ.2,450.1 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
కానీ, గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,986.3 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 18 శాతం తగ్గిందని సంస్థ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఈ త్రైమాసికంలో ఇండిగో మొత్తం ఆదాయం రూ.20,062.3 కోట్ల నుంచి రూ.22,992.8 కోట్లకు పెరిగింది.
వివరాలు
86.9 శాతానికి చేరుకున్న ఆక్యుపెన్సీ రేషియో
ఆక్యుపెన్సీ రేషియో 1.2 శాతం మెరుగై 86.9 శాతానికి చేరుకుంది. ఇండిగో మార్కెట్ వాటా విషయంలో తమ స్థానాన్ని మరింత బలపరుచుకుంది.
గతేడాది ఇదే సమయంలో 62.1 శాతంగా ఉన్న మార్కెట్ వాటా ఈ ఏడాది 63.8 శాతానికి పెరిగింది.
ఫలితాల ప్రభావంతో నేటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండిగో షేర్లు 0.66 శాతం పెరుగుదలతో రూ.4,162 వద్ద ముగిశాయని సమాచారం.