Loading...
InnoData laysoffs: ల్యాప్‌టాప్‌లు ఆఫ్‌.. ఐడీలు డీయాక్టివేట్‌.. లంచ్‌ టైమ్‌లో లేఆఫ్‌లు!
ల్యాప్‌టాప్‌లు ఆఫ్‌.. ఐడీలు డీయాక్టివేట్‌.. లంచ్‌ టైమ్‌లో లేఆఫ్‌లు!

InnoData laysoffs: ల్యాప్‌టాప్‌లు ఆఫ్‌.. ఐడీలు డీయాక్టివేట్‌.. లంచ్‌ టైమ్‌లో లేఆఫ్‌లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. వ్యాపార అవసరాలు, సంస్థల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిబ్బందిని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని సంస్థలు ముందుగానే సమాచారం ఇస్తుండగా.. మరికొన్ని ఎలాంటి ముందస్తు సూచన లేకుండానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఏఐ సేవలు, గ్లోబల్ డేటా ఇంజినీరింగ్ రంగంలో పనిచేస్తున్న ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. సోమవారం విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. కొందరి ల్యాప్‌టాప్‌లు అకస్మాత్తుగా లాగౌట్ కావడంతోపాటు, కంపెనీ వ్యవస్థల్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఐడీలు డీయాక్టివేట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

వివరాలు 

క్కొక్కరుగా కంపెనీ సిస్టమ్స్‌కు యాక్సెస్ కోల్పోయారు 

ఎప్పటిలాగే ఉదయం తమ రోజువారీ పనులు ప్రారంభించామని, మధ్యాహ్నం సమయంలో ఉద్యోగాల కోతకు సంబంధించిన వార్తలు ఒక్కసారిగా వ్యాపించాయని బాధిత ఉద్యోగులు తెలిపారు.

ఆ తర్వాత ఒక్కొక్కరుగా కంపెనీ సిస్టమ్స్‌కు యాక్సెస్ కోల్పోయారని, తమ ఐడీలు పనిచేయడం ఆగిపోయాయని పేర్కొన్నారు.

అనంతరం వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాలకు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సందేశాలు వచ్చినట్లు వివరించారు.

వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగుల పనితీరును ఆధారంగా చేసుకుని తొలగింపులు చేపట్టలేదని సంస్థ ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది.

వివరాలు 

550 మంది ఉద్యోగాలపై ప్రభావం

ఈ లేఆఫ్‌ల కారణంగా భారత్‌లో మొత్తం 550 మంది ఉద్యోగాలపై ప్రభావం పడింది.

ఫిలిప్పీన్స్‌లోని తమ కార్యాలయాల్లోనూ పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు సమాచారం.

ఉద్యోగులను తొలగించడంతోపాటు హెచ్‌ఆర్ యాప్‌ యాక్సెస్‌ను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

దీంతో బాధితులు తమ పేస్లిప్‌లు, ఇతర ముఖ్యమైన ఉద్యోగ సంబంధిత పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా సోషల్ మీడియాలో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని, తమ సమస్యలను సంస్థ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

న్యూజెర్సీ కేంద్రంగా ఇన్నోడేటా కార్యకలాపాలు

అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా ఇన్నోడేటా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

టెక్ కంపెనీలకు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఉన్న సేవలను మెరుగుపర్చడంలో సహకరిస్తోంది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, సోనీ, బోయింగ్, డెలాయిట్ వంటి ప్రముఖ సంస్థలు ఇన్నోడేటా కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.

సంస్థ 2025 వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోడేటాలో 10,107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తోపాటు ఫిలిప్పీన్స్‌లోనూ ఉద్యోగుల తొలగింపు జరగడం టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచుతోంది.

ADVERTISEMENT