Loading...
US Fortress Plan: భారీ యుద్ధాలకు అమెరికా సిద్ధం.. 90 రోజుల పాటు పనిచేసేలా సైనిక స్థావరాలు!
భారీ యుద్ధాలకు అమెరికా సిద్ధం.. 90 రోజుల పాటు పనిచేసేలా సైనిక స్థావరాలు!

US Fortress Plan: భారీ యుద్ధాలకు అమెరికా సిద్ధం.. 90 రోజుల పాటు పనిచేసేలా సైనిక స్థావరాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తన భూభాగానికి రక్షణ కల్పించడంతో పాటు.. యుద్ధ సమయంలో బయటి వ్యవస్థలపై ఆధారపడకుండా సైనిక స్థావరాలు స్వతంత్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఫోర్ట్రెస్‌ ప్లాన్‌' (US Fortress Plan) అమలుపై దృష్టి సారించింది. సరఫరా వ్యవస్థలు, పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా.. సైనిక స్థావరాలు కనీసం 90 రోజుల పాటు సొంతంగా కార్యకలాపాలు నిర్వహించేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫాక్స్‌ న్యూస్‌ తన కథనంలో వెల్లడించింది.

వివరాలు 

విద్యుత్తు భద్రతపై పెంటగాన్‌ దృష్టి.. ట్రంప్‌ కొత్త రక్షణ విధానాలు

దేశ రక్షణ కోసం సాధారణ పౌర మౌలిక సదుపాయాలపై ఆధారపడటం ప్రమాదకరమని పెంటగాన్‌ ముఖ్య అధికార ప్రతినిధి సీన్‌ పార్నెల్‌ పేర్కొన్నట్లు ఫాక్స్‌ న్యూస్‌ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు అత్యంత కీలకంగా మారిందని ఆయన వివరించారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే సమాచార వ్యవస్థలు పనిచేయవని, రవాణా సదుపాయాలపైనా ప్రభావం పడుతుందని చెప్పారు.

ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని 'ఫోర్ట్రెస్‌' ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

అమెరికా భూభాగానికి రక్షణ కల్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త విధానాలకు మార్గం సుగమం చేస్తున్నారని పార్నెల్‌ పేర్కొన్నట్లు ఆ కథనం వివరించింది.

'గోల్డెన్‌ డోమ్‌', 'ఫోర్ట్రెస్‌' ప్రణాళికలు ఈ దిశగా చేపడుతున్న చర్యలకు ఉదాహరణలని ఆయన తెలిపారు.

వివరాలు 

పోర్టబుల్‌ అణు రియాక్టర్లతో నిరంతర విద్యుత్తు

'ఫోర్ట్రెస్‌' ప్రణాళికలో భాగంగా అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కీలకమైన సైనిక స్థావరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్థావరాలు కనీసం 90 రోజుల పాటు బయటి సహాయం లేకుండానే కీలక కార్యకలాపాలను కొనసాగించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది.

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం పోర్టబుల్‌ అణు రియాక్టర్లు, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ వ్యవస్థలు, మైక్రోగ్రిడ్‌లను వినియోగించాలనే ప్రణాళికలు ఉన్నాయి.

యుద్ధ సమయంలో ఆయుధాలు, ఇంధనం, వైద్య సామగ్రి, కీలక ఖనిజాలు, విడిభాగాల కొరత ఏర్పడినా సైనిక కార్యకలాపాలు ఆగిపోకుండా చూడటమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

సరఫరా గొలుసులు దెబ్బతిన్నా సైనిక స్థావరాలు అవసరమైన వనరులను సమకూర్చుకుని పనిచేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

రక్షణ ఉత్పత్తుల కోసం పౌర ఫ్యాక్టరీల్లో మార్పులు

అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షణ రంగానికి అవసరమైన వస్తువులను తయారు చేసేందుకు పౌర పరిశ్రమలను కూడా ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది.

ఇందుకోసం ఎంపిక చేసిన ఫ్యాక్టరీల్లో అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు సమాచారం.

ఆయా పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సైబర్‌ భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలపై పెంటగాన్‌ దృష్టి సారిస్తోంది.

యుద్ధ సమయంలో సాధారణ సరఫరా వ్యవస్థలు అంతరాయం కలిగించినా రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులు కొనసాగించేలా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT