
Health insurance: హెల్త్ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలు సరిపోతాయా? అనే ఆందోళన పాలసీదారుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ 'హెల్త్ అన్‌లిమిటెడ్' పేరుతో నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
దాదాపు 80 శాతం మంది పాలసీదారులు తమ బీమా కవరేజీ అత్యవసర సమయంలో చాలదని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆస్పత్రిలో అనుకోని ఆరోగ్య సమస్యలతో చేరినప్పుడు వచ్చే భారీ బిల్లులు తమ పాలసీతో పూర్తిగా కవర్ అవ్వవని భావించడమే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు.
ఇక మరోవైపు, సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మందికి పైగా పాలసీ మొత్తం వినియోగించిన తరువాత 'రిచార్జ్' విధానం ఉన్న పాలసీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
Details
వైద్య ఖర్చులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి
దీనివల్ల సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించే విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనూప్ రావ్ తెలిపారు.
రోజు రోజుకీ వైద్య సేవల ఖర్చులు పెరుగుతుండటంతో ఇప్పటికే బీమా కలిగి ఉన్నవారికీ భవిష్యత్తు గూర్చి ఆందోళన తలెత్తుతోందని ఆయన అన్నారు.
ఈ సర్వేలో 25 ఏళ్లకు పైబడిన 800 మంది పాలసీదారుల అభిప్రాయాలను నమోదు చేశారు.
కాగా 2021లో భారత్‌లో వైద్య ద్రవ్యోల్బణం చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోల్చితే సుమారు 14 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.