
ఫోన్ అంటే ఇదే కదా..! రూ.8,999లకే ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్
ఈ వార్తాకథనం ఏంటి
రియల్ మీ వినియోగదారులకు కోసం అదిరిపోయే ఫోన్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది.
చైనా కు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం అయిన రియల్ మీ కంపెనీ అతి తక్కువ ధరకు 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించనుంది. ఈ ఫోన్ ధర రూ.8,999 గా ఉండనుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో నార్జో N53 ఫోన్ ను గురువారం విడుదల చేసింది.
నార్జో ఎన్ సిరీస్ లో రియల్ మీ తీసుకొచ్చిన రెండో ఫోన్ ను తీసుకురావడం విశేషం. మే 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Details
30 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి
ఫస్ట్ సేల్ లో 4జీబీ వేరియంట్ ను రూ.500, 6జీబీ వేరియంట్ ను రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించారు. ముఖ్యంగా HDFC బ్యాంకు హోల్డర్లు వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
ఈ మొబైల్ లో 6.74 అంగుళాల డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో డిస్ ప్లే వచ్చింది. వెనక వైపు 50 ఎంపీ కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా రానుంది.
కేవలం అర్ధగంటలోనే 50శాతం చార్జింగ్ అవుతుందని రియల్ కంపెనీ స్పష్టం చేసింది. బ్లాక్, గోల్డ్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.