లావా అగ్ని టు 5జీ ఫోన్ అదిరింది బాసూ.. ధర ఎంతంటే..?
అదిరిపోయే ఫీచర్స్ తో లావా అగ్ని టు 5జీ ఫోన్ లాంచ్ అయింది. అగ్ని లైనప్ లో రెండో మోడల్ ను దేశీయ బ్రాండ్ లావా తీసుకొచ్చింది. అగ్ని 5జీకి ఇది సక్సెసర్ గా ముందుకొచ్చింది. 120 హార్ట్ రిఫ్రెష్ రేట్ ఉన్న కర్వ్డ్ అమోడల్ డిస్ ప్లే ఈ మొబైల్ కు ప్రత్యేక అకర్షణీయంగా నిలవనుంది. ముఖ్యంగా వెనుక నాలుగు కెమెరాల సెటప్ తో ఈ మొబైల్ రావడం విశేషం. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ + అమోలెడ్ డిస్ ప్లేను ఈ మొబైల్ కలిగింది ఉంది. 3-డీ డ్యుయెల్ కర్వ్డ్ డిజైన్ తో డిస్ ప్లే, హెచ్ డీఆర్ 10+కు సపోర్ట్ చేయనుంది.
15 నిమిషాల్లోనే 50శాతం ఛార్జింగ్ పూర్తి
ఈ మొబైల్ లో మీడియాటెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ పై రన్ కానుంది ఈ ప్రాసెసర్ తో ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే.. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్ తీసుకొచ్చింది. 4,700mAh బ్యాటరీని లావా అగ్ని టు 5జీ కలిగి ఉంది. 15 నిమిషాల్లోనే ఈ మొబైల్ 50శాతం చార్జ్ అవుతుందని సంస్థ పేర్కొంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న లావా అగ్ని టు 5జీ ధర రూ.21,999గా ఉంది. అమెజాన్లో ఈనెల 24న ఈమొబైల్ సేల్ ప్రారంభం అవుతుంది. ఏదైనా బ్యాంకుకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే దాదాపుగా రూ.2వేలు డిస్కౌంట్ పొందవచ్చు.