Jensen Huang: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద రూ.12.5 లక్షల కోట్లు.. కుటుంబ సభ్యుల ఆస్తులెంత?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ నివిడియా(Nvidia) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ (63) సంపద ప్రస్తుతం భారీ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ అంచనాల ప్రకారం నవంబర్ 11 నాటికి ఆయన వ్యక్తిగత సంపద సుమారు 151.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.12.5 లక్షల కోట్లు) చేరింది. గత నెలలో ఒక దశలో ఇది 200 బిలియన్ డాలర్లకు చేరగా.. ఇటీవల భారీగా తగ్గింది. ఎన్విడియా షేర్ల ధరలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కూడా ఆయన సంపదను సుమారు 150.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
వివరాలు
ఎన్విడియాలో వాటా.. జీతం,కుటుంబ ఫౌండేషన్ ఆస్తులు
జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియాలో సుమారు 3.58 శాతం వాటా ఉంది.
కంపెనీ షేర్ల ధరలో ప్రతి 10 డాలర్ల మార్పు ఆయన సంపదపై బిలియన్ల డాలర్ల ప్రభావం చూపుతుంది.
తాజా ఆర్థిక సంవత్సరంలో సీఈఓగా ఆయనకు జీతం, షేర్లు, ప్రోత్సాహకాల రూపంలో మొత్తం 36.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.300 కోట్లు) అందాయి.
ఇందులో ప్రాథమిక జీతం 1.49 మిలియన్ డాలర్లు కాగా.. షేర్ల రూపంలో 24.8 మిలియన్ డాలర్లు లభించాయి.
హువాంగ్ భార్య లోరీ హువాంగ్ 2007లో స్థాపించిన జెన్-హ్సున్ అండ్ లోరీ హువాంగ్ ఫౌండేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
భార్య ఫౌండేషన్.. ఎన్విడియాలోనే పిల్లల ఉద్యోగాలు
ఈ ఫౌండేషన్ ఆస్తులు ప్రధానంగా ఎన్విడియా షేర్ల రూపంలో ఉన్నాయి.
వాటి విలువ 9 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఈ ఫౌండేషన్ నుంచి భార్యాభర్తలిద్దరూ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు.
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్లు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి సుమారు 30 మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు.
హువాంగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మాడిసన్ హువాంగ్ ఎన్విడియాలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆమెకు సుమారు 1.23మిలియన్ డాలర్ల వేతనం అందింది.
కుమారుడు స్పెన్సర్ హువాంగ్ రోబోటిక్స్ సాఫ్ట్‌వేర్ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు 1.32మిలియన్ డాలర్లు వేతనంగా లభించింది. అయితే పిల్లల వ్యక్తిగత ఆస్తుల విలువ ఎంతనేది బహిరంగంగా వెల్లడించలేదు.
వివరాలు
ప్రత్యర్థి సంస్థ సీఈఓతోనూ బంధుత్వం..
ఇక హువాంగ్ కుటుంబానికి మరో ప్రముఖ బంధువు కూడా ఉన్నారు.
ఎన్విడియాకు ప్రత్యర్థి సంస్థ అయిన ఏఎండీ (AMD) సీఈఓ లిసా సూ ఆయనకు బంధువు.
వీరిద్దరూ తల్లి వైపు నుంచి బంధుత్వం కలిగిన వారు. లిసా సూ సంపద సుమారు 1.3 నుంచి 2.7 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని వివిధ అంచనాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, కంపెనీ బోర్డు ఆయన నాయకత్వంపై తీసుకోబోయే నిర్ణయాలు ఎన్విడియా షేర్లపై ప్రభావం చూపుతున్నాయి.
వివరాలు
ప్రత్యర్థి సంస్థ సీఈఓతోనూ బంధుత్వం..
ఈ వారం కంపెనీ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ డాలర్లు తగ్గినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఒకవేళ హువాంగ్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నా ఆయన వద్ద ఉన్న షేర్లు మాత్రం అలాగే ఉంటాయి.
అయితే షేర్ల ధర తగ్గితే ఆయన కుటుంబ ఫౌండేషన్ ఆస్తుల విలువ కూడా తగ్గే అవకాశం ఉంది.