Loading...
TDS: ఉద్యోగం మారారా? TDS కట్ అయినా రూ.1.69 లక్షల ట్యాక్స్ పడొచ్చు.. కారణం ఇదే!
ఉద్యోగం మారారా? TDS కట్ అయినా రూ.1.69 లక్షల ట్యాక్స్ పడొచ్చు.. కారణం ఇదే!

TDS: ఉద్యోగం మారారా? TDS కట్ అయినా రూ.1.69 లక్షల ట్యాక్స్ పడొచ్చు.. కారణం ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారిన ఉద్యోగులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. పాత కంపెనీ, కొత్త కంపెనీ రెండూ సరిగ్గా TDS (Tax Deducted at Source) కట్ చేసినా.. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో అదనంగా భారీ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. దీనికి ప్రధాన కారణం ఫామ్ 12B సమర్పించకపోవడమేనని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సలహా సంస్థ '1 Finance'కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజర్ దేవ్ పటేల్ వెల్లడించిన ఓ ఉదాహరణలో, ఉద్యోగం మారిన ఓ వ్యక్తికి ITR దాఖలు సమయంలో రూ.1.69 లక్షల అదనపు పన్ను బకాయి వచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

కొత్త పన్ను విధానం ప్రకారం పాత కంపెనీలో TDS కట్ కాలేదు

ఆ ఉద్యోగి 2025 ఏప్రిల్ నుంచి జూలై వరకు పాత కంపెనీలో పనిచేసి రూ.7 లక్షల జీతం పొందాడు.

కొత్త కంపెనీలో 2025 ఆగస్టు నుంచి 2026 మార్చి వరకు పనిచేసి రూ.18 లక్షలు సంపాదించాడు.

పాత కంపెనీ వద్ద కొత్త పన్ను విధానం ప్రకారం సెక్షన్ 87A రాయితీ వర్తించడంతో TDS కట్ కాలేదు.

కొత్త కంపెనీ మాత్రం తన వద్ద చెల్లించిన రూ.18 లక్షల జీతం ఆధారంగా రూ.1.51 లక్షల TDS కట్ చేసింది.

వివరాలు 

ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగి మొత్తం వార్షిక ఆదాయాన్ని ఒకటిగా పరిగణిస్తుంది

అయితే ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగి మొత్తం వార్షిక ఆదాయాన్ని ఒకటిగా పరిగణిస్తుంది. అంటే ఈ ఉద్యోగి మొత్తం వార్షిక ఆదాయం రూ.25లక్షలుగా లెక్కించబడింది.

ఈ మొత్తం ఆదాయంపై పన్ను లెక్కించడంతో అతని మొత్తం ట్యాక్స్ బాధ్యత రూ.3.20 లక్షలకు చేరింది.

ఇప్పటికే కట్ చేసిన TDS రూ.1.51 లక్షలు మాత్రమే కావడంతో మిగిలిన రూ.1.69 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. దీనికి వడ్డీ కూడా వర్తించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైనాన్షియల్ అడ్వైజర్ దేవ్ పటేల్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

కొత్త యజమానికి ఫామ్ 12B ఇవ్వాలి

దేవ్ పటేల్ వివరించిన ప్రకారం, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉద్యోగం మారిన వెంటనే కొత్త యజమానికి ఫామ్ 12B (Income Tax Act, 2025 ప్రకారం ప్రస్తుతం ఫామ్ 122) ఇవ్వాలి.

ఇందులో పాత కంపెనీ నుంచి పొందిన జీతం, ఇప్పటికే కట్ చేసిన TDS వివరాలు ఉంటాయి.

వీటి ఆధారంగా కొత్త కంపెనీ మొత్తం వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని సరైన TDSను నెల నెలా కట్ చేయగలదు.

వివరాలు 

జూలై 31లోపు సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మార్చిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ ఇచ్చిన Form 16పై మాత్రమే ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ITR దాఖలు చేసే ముందు రెండు కంపెనీల నుంచి వచ్చిన Form 16లను పరిశీలించి, మొత్తం జీతం, ఒకసారి మాత్రమే వర్తించే స్టాండర్డ్ డిడక్షన్, మొత్తం TDS, వాస్తవ పన్ను బాధ్యతను పోల్చుకోవాలి.

ఏదైనా తేడా ఉంటే జూలై 31లోపు సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లించడం మంచిదని సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. తాజా పన్ను నిబంధనలు, వ్యక్తిగత పన్ను లెక్కల కోసం అర్హత కలిగిన పన్ను నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ADVERTISEMENT