Bank Of Baroda Jobs 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రూ.లక్షన్నర జీతం.. నో ఎగ్జామ్!
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) దేశవ్యాప్తంగా ఉన్న తన పలు శాఖల్లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 49 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ పోస్టులున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.
Details
వయో పరితిమి 22 నుంచి 40 ఏళ్లు మధ్య ఉండాలి
పోస్టులను బట్టి అభ్యర్థుల వయోపరిమితి 22 నుంచి 40 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది.