Loading...
Bima Sakhi: 10వ తరగతి పాసైతే చాలు.. మహిళలకు ఎల్‌ఐసీ నుంచి నెలకు రూ.7,000!
10వ తరగతి పాసైతే చాలు.. మహిళలకు ఎల్‌ఐసీ నుంచి నెలకు రూ.7,000!

Bima Sakhi: 10వ తరగతి పాసైతే చాలు.. మహిళలకు ఎల్‌ఐసీ నుంచి నెలకు రూ.7,000!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

సొంతంగా సంపాదిస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలనుకునే మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. 'బీమా సఖి' పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు మొదటి మూడేళ్ల పాటు ప్రతి నెలా స్టైపెండ్ అందించడంతో పాటు, బీమా పాలసీలకు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తారు. పథకం ద్వారా నెలకు గరిష్ఠంగా రూ.7,000 వరకు స్టైపెండ్ పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఆదాయ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.

వివరాలు

చదువు, వయస్సు ఎంత ఉండాలి?

బీమా సఖి పథకంలో చేరడానికి ఉన్నత విద్యార్హతలు అవసరం లేదు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

18 ఏళ్లు నిండిన మహిళల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ పథకంలో ప్రాధాన్యం కల్పిస్తారు

వివరాలు

నెలకు రూ.7,000 ఎలా పొందవచ్చు?

సాధారణంగా ఇన్సూరెన్స్ రంగంలో పాలసీలు విక్రయించినప్పుడు వాటిపై వచ్చే కమీషన్ ద్వారానే ఆదాయం లభిస్తుంది.

అయితే బీమా సఖి పథకంలో చేరిన మహిళలకు ఎల్‌ఐసీ మొదటి మూడేళ్ల పాటు నిర్ణీత మొత్తాన్ని స్టైపెండ్ రూపంలో చెల్లిస్తుంది. ఈ మొత్తం ఏడాది వారీగా మారుతుంది.

మొదటి సంవత్సరం: నెలకు రూ.7,000స్టైపెండ్.

రెండో సంవత్సరం: నెలకు రూ.6,000స్టైపెండ్.

మూడో సంవత్సరం: నెలకు రూ.5,000 స్టైపెండ్.

స్టైపెండ్‌తో పాటు మహిళలకు బీమా పాలసీల విక్రయంపై ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారు. నిర్ణీత లక్ష్యానికి మించి పాలసీలు విక్రయిస్తే, నెలవారీ స్టైపెండ్‌కు అదనంగా కమీషన్ పొందే అవకాశం ఉంటుంది.

మూడేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కొనసాగవచ్చు. తద్వారా పాలసీల విక్రయం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

బీమా సఖి పథకంలోని ముఖ్యమైన నిబంధనలు

ఈ పథకంలో చేరే మహిళలు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

ఇప్పటికే కుటుంబంలో ఎవరైనా ఎల్‌ఐసీ ఉద్యోగిగా లేదా ఏజెంట్‌గా పనిచేస్తుంటే, వారి రక్తసంబంధీకులు లేదా బంధువులు ఈ పథకానికి అర్హులు కారు.

మొదటి ఏడాదిలో విక్రయించిన పాలసీల్లో కనీసం 65 శాతం పాలసీలు కొనసాగాలి. అంటే, ఆ పాలసీలు మధ్యలోనే నిలిచిపోకుండా ప్రీమియంలు చెల్లించేలా చూసుకోవాలి.

బీమా సఖి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ పథకంలో చేరాలనుకునే మహిళలు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు

కావాల్సిన పత్రాలు

పదో తరగతి మార్కుల మెమో

ఆధార్ కార్డు లేదా చిరునామా ధ్రువీకరణ పత్రం

వయస్సు ధ్రువీకరణ పత్రం

ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి బీమా సఖి పథకానికి సంబంధించిన దరఖాస్తులో వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.

అనంతరం అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ADVERTISEMENT