Karandeep Anand: డిస్నీ కొత్త సీటీఓగా కరణ్‌దీప్ ఆనంద్.. అక్టోబర్ 2 నుంచి బాధ్యతలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 19, 2026
05:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్నీ (Disney) నూతన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా కరణ్‌దీప్ ఆనంద్‌ను నియమించింది. గతంలో క్యారక్టర్.ఏఐ (Character.AI) సంస్థ సీఈఓగా పనిచేసిన ఆయన.. అక్టోబర్ 2న డిస్నీలో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. సీటీఓ హోదాతోపాటు.. డిస్నీ కొత్తగా సృష్టించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (Senior Executive Vice President) పదవిలోనూ కరణ్‌దీప్ కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, వినియోగదారుల సాంకేతికత, కృత్రిమ మేధ (AI) వంటి విభిన్న రంగాల్లో కరణ్‌దీప్‌కు విశేష అనుభవం ఉందని డిస్నీ తెలిపింది. ఆయన తమ సీనియర్ నాయకత్వ బృందంలో మరో కీలక సభ్యుడిగా వ్యవహరించనున్నారని పేర్కొంది.