Gold and Silver Rates: గోల్డ్ కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఒక్కరోజులోనే ధరల పెరుగుదల షాకిచ్చింది. గంటల వ్యవధిలోనే మార్కెట్ పరిస్థితి మారిపోవడంతో కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో పెరిగిన గోల్డ్ రేట్లు దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,46,080గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.220 పెరిగింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,33,900కు చేరుకుని రూ.200 పెరుగుదలను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో కూడా 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,080గా ఉండగా,22క్యారెట్ల బంగారం ధర రూ.1,33,900గా కొనసాగుతోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,370గా నమోదై శనివారం రూ.330 పెరిగింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,000గా ఉండి రూ.300 మేర పెరుగుదల కనిపించింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,080గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,900గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,230గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,050 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగా వెండి ధరలు బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇదే ధర ఉండగా, బెంగళూరు,ఢిల్లీల్లో కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
గోల్డ్ రేట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు, ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో గోల్డ్ మార్కెట్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ కదలికలు,పెట్టుబడిదారుల ధోరణిని బట్టి రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పెరుగుదల కొనసాగుతుందా లేదా మార్కెట్లో మళ్లీ మార్పులు చోటుచేసుకుంటాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.