59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు. మాజీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ ను వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని పేజ్ సిక్స్ పత్రిక వెల్లడి చేసింది. జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ ప్రస్తుతం కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ పార్టీ కోసం ఫ్రాన్స్ లో ఉన్నారు. లారెన్ చేతికి హార్ట్ షేప్ లో ఉన్న డైమండ్ రింగ్ కనిపించడంతో, వీరిద్దరి పెళ్ళి వార్తలు బయటకు వచ్చాయి. మాజీ జర్నలిస్ట్ అయిన సాంచెజ్ తో జెఫ్ బెజోస్ 2018నుండి రిలేషన్ లో ఉంటున్నారట. 2019 జులై 14వ తేదీన తమ బంధం గురించి అందరికీ తెలియజేసారు.
విడాకుల భరణంగా 38.3బిలియన్ డాలర్లు చెల్లించిన జెఫ్ బెజోస్
జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ తో 2019లో విడిపోయారు. తమ 25ఏళ్ల బంధానికి వీరిద్దరూ దూరం జరిగారు. వీరికి నలుగురు పిల్లలు. విడాకుల తర్వాత మెకెంజీ కి జెఫ్ బెజోస్ 38.3బిలియన్ల డాలర్లు చెల్లించాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది మెకెంజీ. ఇకపోతే, పాట్రిక్ వైట్ సెల్ ని వివాహం చేసుకుని ఎల్లా, ఎవన్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది లారెన్. అంతేకాదు ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్ టోనీ గోంజ్లెజ్ తో ఆమెకు వివాహం అయ్యింది. వీరిద్దరికీ 22ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని అమెరికా పత్రికల సారాంశం.