టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగుల సంఖ్య, నియామకాలను తెలుసుకుందాం
గత ఏడాది నుంచి ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి గ్లోబల్ టెక్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి. 2023 మార్చి త్రైమాసికంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌సహా భారతదేశంలోని ఐటీ కంపెనీలు నియామకాల్లో మందగమనంతో పాటు అట్రిషన్ రేట్ల తగ్గుదలని నివేదించాయి. ఈ నేపథ్యంలో ఐటీ దగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. వాటి అట్రిషన్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
మొత్తం ఉద్యోగుల సంఖ్య: మార్చి 31, 2023 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,14,795గా ఉంది. ఇది సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో నమోదైన 6,16,171 మంది ఉద్యోగులతో పోలిస్తే తక్కువ. టీసీఎస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 150దేశాలకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులు 35.7 శాతం ఉన్నారు. అట్రిషన్: కంపెనీ ఐటీ సేవల అట్రిషన్ రేటు తక్కువగా ఉంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన 20.1 శాతం వద్ద ఉంది. డిసెంబర్ 2022తో ముగిసిన మునుపటి త్రైమాసికంలో అట్రిషన్ రేటు 21.3 శాతంగా ఉంది. నియామకాలు: టీసీఎస్‌లో 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో లో కేవలం 821 మంది ఉద్యోగులను, సంవత్సరంలో 22,600 మంది ఉద్యోగులను నియమించారు.
ఇన్ఫోసిస్ కంపెనీ
మొత్తం ఉద్యోగుల సంఖ్య: మార్చి 31, 2023 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,43,234. ఇది మునుపటి త్రైమాసికానికంటే 3,611 తక్కువ. అట్రిషన్: ఇన్ఫోసిస్ వాలంటరీ అట్రిషన్ పన్నెండు నెలల ప్రాతిపదికన 20.9 శాతంగా ఉంది. ఇది క్షీణతను నమోదు చేసింది. క్యూ1 2023లో 28.4 శాతం ఉండగా, క్యూ2లో 27.1 శాతానికి పడిపోయింది. నియామకాలు: కంపెనీ 2023 నాల్గవ త్రైమాసికంలో 1,627 మంది ఉద్యోగులను నియమించారు. ఇది మునుపటి త్రైమాసికం కంటే తక్కువగా ఉంది.
హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ
మొత్తం ఉద్యోగుల సంఖ్య: మార్చి 31, 2023 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,25,944గా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 11,100 మంది తక్కువగా ఉన్నారు. అట్రిషన్: క్యూ4 త్రైమాసికంలో అట్రిషన్ రేటు గత పన్నెండు నెలల ప్రాతిపదికన 19.5 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో 21.7 శాతం ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 21.9 శాతం ఉండటం గమనార్హం. నియామకాలు: హెచ్‌సీఎల్ టెక్ 2023 ఆర్థిక సంవత్సరానికి 17,067 మంది ఉద్యోగులను నియమించింది. 2022లో 39,900 మంది ఉద్యోగులను నియమించారు. 2023లో దాదాపు నియామకాలు 57.3 శాతానికి పడిపోయాయి.