Polymer currency: రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పు.. కేంద్రం కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత కరెన్సీలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదించింది. ఒక్కో డినామినేషన్‌లో 100 కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం తీసుకురానున్నారు. ఆర్బీఐ కేంద్ర బోర్డు సిఫారసు మేరకు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపగా.. తాజాగా ఆమోదం లభించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
వివరాలు
పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యం
ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్తులో ఈ రెండు విలువల పాలిమర్ నోట్లను క్రమం తప్పకుండా చలామణిలోకి తీసుకురావాలని ప్రతిపాదనలో ఉంది.
అయితే ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని ఆర్బీఐ తెలిపింది.
దీంతో పాలిమర్ నోట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, వాటి కోసం ఎంత ఖర్చవుతుందో ఇంకా నిర్ణయించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
2027-28 ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ పనిచేస్తున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా గతంలో వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్రం అమోదం
STORY | Government approves introduction of one billion polymer banknotes of Rs 10 and 20
— Press Trust of India (@PTI_News) August 11, 2026
The government has approved the introduction of one billion polymer banknotes of Rs 10 and Rs 20 for field trials, Parliament was informed on Tuesday.
The Reserve Bank of India (RBI), with… pic.twitter.com/wUjl0DL93Z