Porsche Layoffs: పోర్షేలో భారీ ఉద్యోగాల కోత.. మరో 4,000 మందికి షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేలో మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సన్నాహాలు జరుగుతున్నట్లు జర్మనీకి చెందిన ఓ పత్రిక వెల్లడించింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేపడుతున్న భారీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా పోర్షే బ్రాండ్‌లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తగ్గించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. సంస్థ ఎదుర్కొంటున్న 700 మిలియన్ యూరోల ఓవర్‌హెడ్ లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 700 మిలియన్ యూరోలు భారత కరెన్సీలో సుమారు రూ.7,600 కోట్లు కాగా.. అమెరికా కరెన్సీలో 803.8 మిలియన్ డాలర్లు. పోర్షే ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అమ్మకాలు తగ్గిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
వివరాలు
ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉద్యోగాల కోత
ఈ పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉద్యోగాల కోతను ప్రతిపాదించినట్లు సమాచారం.
తాజాగా ప్రతిపాదించిన 4,000 ఉద్యోగాల కోతలు గతంలో కుదిరిన ఒప్పందాలకు అదనంగా ఉండనున్నాయి. గత జులైలో పోర్షే యాజమాన్యం, కార్మిక ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందంలో 9,000 మంది ఉద్యోగాలను తొలగించేందుకు అంగీకారం కుదిరింది.
ఇప్పుడు మరో 4,000 ఉద్యోగాల కోత ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఇప్పటికే అంగీకరించిన తొలగింపులకు ఇది అదనంగా ఉండనుంది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేపడుతున్న పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా పోర్షేలో ఖర్చుల నియంత్రణ, సంస్థ ఆర్థిక ఒత్తిడిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి.