ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్
మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు. మార్నే లెవిన్ ఇంస్టాగ్రామ్ మొదటి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫిబ్రవరి 21, 2023న లెవిన్ తన పదవి నుండి వైదొలగనున్నారు. ఆమె నిష్క్రమణ వరకు కంపెనీ ఉద్యోగిగానే ఉంటారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి, లెవిన్ ఫేస్‌బుక్‌లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్‌గా కంపెనీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ మొదటి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాత్రమే కాదు మెటాలో ముఖ్య పాత్ర పోషించారు.
లెవిన్ నిష్క్రమణ నేపథ్యంలో నికోలా మెండెల్సోన్, జస్టిన్ ఓసోఫ్స్కీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు
మెటా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేవియర్ ఒలివాన్ మాట్లాడుతూ గ్లోబల్ పాలసీని అమలు చేయడం నుండి మా ఇన్‌స్టాగ్రామ్ వ్యాపారాన్ని మొదటి COOగా అభివృద్ధి చేయడం వరకు, మా ప్రకటనలు మరియు వ్యాపార భాగస్వామ్య బృందాలకు నాయకత్వం వహించడం వరకు, మార్నే గత 13 సంవత్సరాలుగా మెటాలో టన పాత్రను సమర్ధవంతంగా పోషించారని అన్నారు. లెవిన్ నిష్క్రమణ నేపథ్యంలో నికోలా మెండెల్సోన్, జస్టిన్ ఓసోఫ్స్కీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. మెండెల్సన్ గ్లోబల్ బిజినెస్ గ్రూప్ రోల్ హెడ్ ఇప్పుడు గ్లోబల్ పార్టనర్‌షిప్‌లు, ఇంజినీరింగ్‌ను పర్యవేక్షిస్తారు. ఆన్‌లైన్ విక్రయాలు, కార్యకలాపాలు, భాగస్వామ్యాలకు ఓసోఫ్స్కీ చూసుకుంటారు. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఆదాయాన్ని పెంచడం, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను పెంచడంపై ఆయన దృష్టి సారిస్తారు.