LOADING...
Money Rule Change from January 1: ఆదాయ పన్ను నుంచి ఎల్పీజీ ధరల వరకూ.. కొత్త ఏడాది కీలక మార్పులు
కొత్త ఏడాది కీలక మార్పులు

Money Rule Change from January 1: ఆదాయ పన్ను నుంచి ఎల్పీజీ ధరల వరకూ.. కొత్త ఏడాది కీలక మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సరం రేపటితో ప్రారంభం కానుండగా, జనవరి 1 నుంచి సామాన్య ప్రజల జేబుపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు విధానాలు, పాన్-ఆధార్ లింకింగ్ నిబంధనలు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కొత్త నియమాలు వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక నియమాలివే.

వివరాలు 

రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయలేరు 

జనవరి 1, 2026 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్‌ను రివైజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటివరకు ఒరిజినల్ రిటర్న్‌లో తేడాలు ఉన్నాయని చెబుతూ ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపుతూ రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలని సూచనలు చేసింది. అయితే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఆ తర్వాత తప్పనిసరిగా అప్‌డేటెడ్ రిటర్న్ లేదా ఐటీఆర్-యూ (ITR-U) దాఖలు చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

బిలేటెడ్ & రివైజ్డ్ ఐటీఆర్ అవకాశం 

బిలేటెడ్ ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే గడువూ డిసెంబర్ 31తోనే ముగుస్తుంది. జనవరి 1 నుంచి 2025-26 సంవత్సరానికి బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉండదు. నిర్ణీత గడువులో ఒరిజినల్ రిటర్న్ దాఖలు చేయలేని వారు బిలేటెడ్ ఐటీఆర్ వేస్తుంటారు. ఈ ఏడాది ఒరిజినల్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 16గా ఉంది. క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ విధానంలో మార్పు జనవరి నుంచి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ చేసే విధానంలో మార్పులు చేయనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకోసారి అప్‌డేట్ అవుతున్న క్రెడిట్ స్కోర్, ఇకపై వారానికి ఒకసారి మారనుంది. దీంతో లోన్ రీపేమెంట్, ప్రీపేమెంట్ వంటి క్రెడిట్ అలవాట్లు త్వరగా స్కోర్‌లో ప్రతిబింబిస్తాయి.

Advertisement

వివరాలు 

8వ వేతన సంఘం అమల్లోకి 

జనవరి 1, 2026 నుంచి 8వ కేంద్ర వేతన సంఘం అమల్లోకి రానుంది. సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘ సిఫార్సులు అమలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆ లెక్కన 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే వేతన పెంపు మాత్రం సిఫార్సులు అమలయ్యాకే అందే అవకాశముండగా, అది కొంత ఆలస్యం కావచ్చని అంచనా. ఎల్పీజీ ధరల్లో మార్పులు ప్రతి నెల మొదటి తేదీన దేశీయ,వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షించడం ఆనవాయితీ. ఆ మేరకు జనవరి 1 నుంచి గృహ వినియోగం,కమర్షియల్ ఎల్పీజీ ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఈ ధరల ప్రభావం నేరుగా వినియోగదారులపై పడనుంది.

Advertisement