Stock Market: ముంబై మున్సిపల్ ఫలితాల ఎఫెక్టు.. స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త ఉత్సాహం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ఈ ప్రభావంతో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచినట్లుగా కనిపిస్తోంది. తాజా పరిస్థితుల్లో సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 83,652 స్థాయిలో కొనసాగుతుండగా, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 25,730 వద్ద ట్రేడవుతోంది.
Details
నష్టాల్లో సిప్లా, భారతి ఎయిర్‌టెల్ స్టాక్‌లు
నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, ఏంజెల్ వన్, 360 వన్ వామ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్వరాజ్ ఇంజిన్స్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, బయోకాన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మరోవైపు సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఒఎన్‌జిసి, అపోలో హాస్పిటల్స్, భారతి ఎయిర్‌టెల్ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.