Mutual Fund: నెలకు రూ.1000 ఖర్చుతో కోటీశ్వరులు అవ్వండిలా..బెనిఫిట్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే చాలా మందికి పరాగ్ పారిఖ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఫండ్స్ గుర్తుకు వస్తాయి. అయితే, గత 32 సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తున్న ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. 1994లో ప్రారంభమైన ఈ ఫండ్, ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఎంతో విలువైనదిగా మారింది. ఈ ఫండ్ ప్రారంభమైన తేదీ (సెప్టెంబర్ 29, 1994) నుంచి ఇప్పటివరకు ఇచ్చిన రాబడులు గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.
వివరాలు
SIP వల్ల లాభాలివే..
ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ నెలా రూ.1,000 చొప్పున SIP రూపంలో పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ మొత్తం సుమారు రూ.1.7 కోట్లకు పెరిగి ఉండేది. అదే విధంగా నెలకు రూ.2,000 పెట్టి ఉంటే, ఆ పెట్టుబడి విలువ ఇప్పటికి దాదాపు రూ.3.38 కోట్లకు చేరుకునేది. ఈ లెక్క ప్రకారం వార్షిక రాబడి సుమారు 19.22%గా ఉంది. ఫండ్ ప్రారంభ సమయంలో ఒకేసారి రూ.1 లక్ష పెట్టి ఉంటే, నేటికి ఆ మొత్తం రూ.1.62 కోట్లకు పైగా పెరిగేది. అంటే మొదటి పెట్టుబడి సుమారు 160 రెట్లు పెరిగినట్టే. దీనికి సగటు వార్షిక రాబడి 17.58%గా నమోదైంది.
వివరాలు
రూ.19,598 కోట్లకు చేరువ..
మార్చి 31, 2026 నాటికి ఈ ఫండ్ నిర్వహిస్తున్న మొత్తం ఆస్తుల విలువ రూ.19,598 కోట్లకు చేరుకుంది. ఈ ఫండ్ ప్రధానంగా బ్యాంకింగ్ రంగంపై దృష్టి సారించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. అదనంగా ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ కంపెనీల్లో కూడా భాగస్వామ్యం ఉంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కావడంతో, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మధ్య పెట్టుబడులను మార్చుకుంటూ ఉంటుంది. 10 నుంచి 15సంవత్సరాలు సంపదను సృష్టించాలనుకునే వారికి, మార్కెట్‌లో వచ్చే మార్పులను తట్టుకోగలిగే వారికి ఈ ఫండ్ మంచి ఎంపికగా ఉంటుంది.