LOADING...
Bank: రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?
రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?

Bank: రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 12 (గురువారం)నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె ప్రభావం ఉండే అవకాశాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ముందస్తుగా సమాచారం ఇచ్చింది. సమ్మె అమలులోకి వస్తే ఆ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA),ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA),బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి ప్రధాన బ్యాంకు సంఘాలు పాల్గొననున్నాయి. వీటితో పాటు 10కేంద్ర కార్మిక సంఘాలు (CTUలు)కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంఘాలు తమ సభ్యులు,యూనిట్లను సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

వివరాలు 

నాలుగు కొత్త కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా సమ్మె

ప్రభుత్వం గత నవంబర్‌లో నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగానే ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి. బ్యాంకు సంస్థలు తమ యూనిట్లు, ఉద్యోగులకు పంపిన లేఖల్లో—ఈ ప్రతిపాదిత కార్మిక కోడ్‌లు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని, ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్‌కు మరింత కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకు ఉద్యోగులకు పని-జీవిత సమతుల్యత కల్పించాలన్న డిమాండ్‌తో పాటు, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు సంఘాలు చాలా కాలంగా కోరుతూ వస్తున్నాయి.

వివరాలు 

కార్యాలయాల పనితీరులో అంతరాయాలు ఏర్పడే అవకాశం

అయితే ఫిబ్రవరి 12న ప్రధాన బ్యాంకులు గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గానీ అధికారికంగా సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ, సమ్మె నిర్ణయించిన విధంగా కొనసాగితే బ్యాంకుల శాఖలు, కార్యాలయాల పనితీరులో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ముందస్తు జాగ్రత్త చర్యగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు ఒక నోట్‌ను సమర్పించింది.

Advertisement