Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ 'బడ్జెట్' డే చీర..మధుబని కళకు అద్భుతమైన నివాళి
ఈ వార్తాకథనం ఏంటి
ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పై మాత్రమే కాకుండా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది.
దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ప్రతి ఏడాది ఆసక్తి రేపుతాయి.
చేనేత చీరలపై ప్రత్యేకమైన మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు.
ఆమె ధరించిన బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర,ఎరుపు రంగు బ్లౌజ్,శాలువాతో కనిపించారు
ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి, మంత్రికి కానుకగా ఇచ్చారు.
2021లో సీతారామన్ బిహార్‌లోని మధుబనికి వెళ్లినప్పుడు దులారీదేవిని కలుసుకొని, కొద్దిసేపు మాట్లాడారు.
వివరాలు
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా 'రామా బ్లూ' రంగు చీర
అనంతరం ఆమె మంత్రికి ఒక చీరను బహూకరించి,బడ్జెట్ వేళ దాన్ని ధరించాలని కోరారు. ఆ మాట ప్రకారం,కేంద్ర మంత్రి ఈ చీరను ధరించారట.
2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ,అప్పటినుంచి ప్రతి ఏడాది బడ్జెట్ రోజు తన చీరల విషయంలో ప్రత్యేకత కనబరుస్తున్నారు.
2019లో,సార్వత్రిక ఎన్నికల ముందు,ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఆమె కాంతా చీరలో కళగా కనిపించారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా 'రామా బ్లూ' రంగు చీరను ధరించారు.
ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీ కనపడింది.
2020లో, నీలం రంగు అంచుతో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీరలో మెరిశారు,ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది.
వివరాలు
'ఆస్పిరేషనల్ ఇండియా' థీమ్
'ఆస్పిరేషనల్ ఇండియా' థీమ్‌ను అనుసరించి ఈ చీరను ధరించారు.
2021లో ఎరుపు-గోధుమ రంగుల కలయికతో ఉన్న భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు, ఇది తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ చీర.
2022లో, మెరూన్ రంగు చీరను ధరించారు, ఇది ఒడిశాకు చెందిన చేనేత చీర.
ఈ రంగులో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు, ఇది ఆమె నిరాడంబరతను సూచిస్తుంది.
2023లో, బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరలో కనిపించారు.
ప్రతి బడ్జెట్ వేళ, నిర్మలమ్మ తన చీరలు ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారు, దీనితో ఆమె దేశపు సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తున్నారు.