Loading...
Sridhar Vembu: ఏఐ ఖర్చులు భారీగా పెరిగాయి.. జీతాలు పెంచలేం: జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
ఏఐ ఖర్చులు భారీగా పెరిగాయి.. జీతాలు పెంచలేం: శ్రీధర్ వెంబు

Sridhar Vembu: ఏఐ ఖర్చులు భారీగా పెరిగాయి.. జీతాలు పెంచలేం: జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో ఉద్యోగులకు ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరగడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, అదే సమయంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచలేమని ఇప్పటికే తెలియజేశామని శ్రీధర్ వెంబు చెప్పారు. ఈ పరిస్థితిని నివారించలేకపోయినందుకు ఉద్యోగులకు క్షమాపణలు కూడా తెలిపినట్లు పేర్కొన్నారు. డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన సర్వర్ల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని, ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కంపెనీపై ఖర్చుల భారం కూడా అధికమవుతోందని వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జోహో ఉద్యోగులకు నిరాశ.. జీతాల పెంపు లేదని ప్రకటించిన శ్రీధర్ వెంబు

వివరాలు 

కొత్త ఉద్యోగులను నియమించుకోవడం లేదు: శ్రీధర్ వెంబు

పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు జోహో ఇప్పటికే మార్కెటింగ్ బడ్జెట్‌ను తగ్గించింది.

అంతేకాకుండా, గత 18 నెలలుగా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం లేదని వెంబు వెల్లడించారు.

ఖర్చులను అదుపులో ఉంచుకుంటూనే సంస్థ కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

ఉద్యోగులపై మరింత ప్రభావం పడకుండా సామూహిక తొలగింపులను నివారించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు.

అయితే, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

కంపెనీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్న ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో సంస్థను తిరిగి పటిష్ఠం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ బబుల్‌కు దారితీసే ప్రమాదంపై గతంలోనే హెచ్చరించిన శ్రీధర్ వెంబు

మరోవైపు, ఏఐపై పెట్టుబడిదారులు చూపిస్తున్న ఆసక్తి కారణంగా టెక్నాలజీ కంపెనీల మార్కెట్ విలువలు గణనీయంగా పెరుగుతున్నాయి.

ఈ ధోరణి గతంలో చోటుచేసుకున్న డాట్‌కామ్ బబుల్‌ను మించిన మార్కెట్ బబుల్‌కు దారితీసే ప్రమాదం ఉందని శ్రీధర్ వెంబు గతంలోనే హెచ్చరించారు.

ఏఐపై పెరుగుతున్న అంచనాలు, పెట్టుబడులు టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT