
Toyoto: మరోసారి టయోటా తయారీ ప్లాంట్ల మూసివేత.. కార్ల ఉత్పత్తికి బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి తయారీ కేంద్రాలను మూసివేసింది. జపాన్‌లోని 14 తయారీ కేంద్రాలను మూసివేసినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.
విడిభాగాల ఆర్డర్లను పర్యవేక్షించే కంప్యూటర్ వ్యవస్థలో లోపం తలెత్తడమే దీనికి ప్రధాన కారణమని టయోటా సంస్థ ధ్రువీకరించింది.
ప్రాథమిక పరిశీలన తర్వాత ఇది సైబర్ దాడి కాకపోవచ్చునని సంస్థ ఓ అంచనా కూడా వచ్చింది. సాంకేతిక లోపానికి కారణమేమిటి అన్న విషయంపై విచారణ జరుపుతామని టయోటా పేర్కొంది.
తయారీ కార్యకలాపాలను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Details
టయోటా తయారీ కేంద్రాల్లో నెమ్మదిగా ఉత్పత్తి
టయోటా మోడల్ కార్ల తయారీలో ఏయే మోడల్ కార్లు నిలిచిపోయాయో ఇంకా వెల్లడించలేదు. ఆసియాలోని పలు దేశాల్లోని టయోటా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే ఉత్పత్తి నెమ్మదిగా సాగుతోంది.
కరోనా ఆంక్షలు, సెమీ కండక్టర్ల కొరతతో అప్పట్లో ఉత్పత్తి నెమ్మదించింది. గతంలో కూడా ఓసారి టయోటా ఇదే తరహాలో తమ ఉత్పత్తిని నిలిపివేసింది.
13000 కార్లను తయారు చేయగలిగే సమాయాన్ని నష్టపోయినట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది.
విడిభాగాలు సరఫరా చేసే ఓ కంపెనీ అంతర్గత సాఫ్ట్‌వేర్‌పై సైబర్ దాడి జరగడమే అప్పట్లో మూసివేతకు కారణమని పేర్కొంది.