వన్ ప్లస్ ప్యాడ్ గో: అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త ట్యాబ్
వన్ ప్లస్(One plus) కంపెనీ అక్టోబర్ 6వ తేదీన ఇండియాలో వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్(One plus pad GO) ని లాంచ్ చేయనుంది. సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ ట్యాబ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సామ్ సంగ్, లెనోవో కంపెనీల ట్యాబ్ ల తరహాలో ఫీఛర్స్ ని వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. వంపు కలిగిన అంచుతో ఉండే ఈ ట్యాబ్ మధ్యలో కెమెరా కూడా ఉంటుంది. సరికొత్త డిజైన్ తో చూడటానికి అందంగా ఉండనుంది. 2.4K డిస్ ప్లే, 7:5 యాస్పెక్ట్ రేషియో, డాల్బీ అట్మాస్ స్టూడియోని కూడా సపోర్ట్ చేస్తుంది.
కంటెంట్ సింక్ ఫంక్షన్ ఫీఛర్ తో వన్ ప్లస్ ప్యాడ్ గో
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే ఈ ట్యాబ్, లాంచ్ అయ్యాక ఆండ్రాయిడ్ 14కి అప్డేట్ అవుతుంది. కంటెంట్ సింక్ ఫంక్షన్ అనే ఫీఛర్ తో వన్ ప్లస్ యూజర్లు, ఫైల్స్ ని షేర్ చేసుకొవచ్చు. వైఫై, సెల్యూలార్ వెర్షన్లలో ఈ మొబైల్ లభిస్తుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వన్ ప్లస్ ప్యాడ్ గో లబ్యం కానుంది. అలాగే వన్ ప్లస్ స్టోర్స్ లలో కూడా దీన్ని పొందవచ్చు. ప్రస్తుతానికి దీని ధర ఎంత ఉండనుందనేది ఇంకా తెలియదు.