LOADING...
Paytm- Agoda: పేటీఎం యాప్‌లో అగోడా హోటళ్లను బుక్‌ చేసుకునే సదుపాయం 
పేటీఎం యాప్‌లో అగోడా హోటళ్లను బుక్‌ చేసుకునే సదుపాయం

Paytm- Agoda: పేటీఎం యాప్‌లో అగోడా హోటళ్లను బుక్‌ చేసుకునే సదుపాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేటియం(Paytm) బ్రాండ్‌ పేరుతో సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డిజిటల్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ అగోడా (Agoda)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో పేటీఎం యాప్‌లో హోటల్‌ బుకింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పేటీఎం ట్రావెల్‌ ద్వారా విమాన, బస్‌, ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న సంస్థ, ఇప్పుడు ఈ కొత్త భాగస్వామ్యంతో తన సేవలను మరింత విస్తరిస్తోంది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని హోటళ్లను కూడా తన యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది.

వివరాలు 

హోటల్‌ బుకింగ్‌ ఆప్షన్‌.. పేటీఎం ట్రావెల్‌ కు కీలక ముందడుగు 

హోటల్‌ బుకింగ్‌ ఆప్షన్‌ను తీసుకురావడం పేటీఎం ట్రావెల్‌ కోసం ఒక కీలక ముందడుగుగా నిలుస్తుందని, ఈ భాగస్వామ్యంతో సమగ్ర ట్రావెల్‌ సేవలందించే సంస్థగా ఎదిగామని పేటీఎం ట్రావెల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వికాశ్‌ జలాన్ పేర్కొన్నారు. పేటీఎం యాప్‌లో హోటల్‌ బుకింగ్‌ ఆప్షన్‌ ద్వారా ప్రయాణికులకు మరింత సులభతరం అవుతుందని, అలాగే ప్రత్యేక డీల్స్‌ కూడా లభిస్తాయని అగోడా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ డామియన్‌ పీచ్‌ తెలిపారు.