
Post Office vs SBI: పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ : ఎక్కడ పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మీ డబ్బును ఎక్కడ పొదుపు లేదా ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఎస్‌బీఐ లేదా పోస్టాఫీస్ పొదుపు ఖాతాల మధ్య ఎంపికలో గందరగోళంలో ఉన్నారా? ఇప్పుడు వడ్డీ రేట్లు, లెక్కింపు విధానం, పన్ను మినహాయింపుల వివరాలను తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా (POSA) అన్ని బ్యాలెన్స్‌లపై వార్షికంగా 4% వడ్డీ అందిస్తుంది.ఇది బ్యాంకుల కంటే ఎక్కువ రాబడిగా ఉంటుంది. వడ్డీ ప్రతి త్రైమాసికం సవరించబడుతుంది, అయితే 2025-26ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలానికి వడ్డీ రేట్లలో మార్పు జరగలేదు. వడ్డీ లెక్కింపు: ప్రతి నెలా 10నుండి నెలాఖరు వరకు కనీస నిల్వ ఆధారంగా లెక్కించబడుతుంది. వడ్డీ సంవత్సరాంతంలో ఖాతాలో జమ అవుతుంది. ఖాతా మూసివేయగానే మునుపటి నెల వరకు వడ్డీ చెల్లించారు.
Details
SBI సేవింగ్స్ ఖాతా
వార్షిక 2.50% వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీ ప్రతి త్రైమాసికం చెల్లించబడుతుంది. SBI, HDFC, ICICI వంటి ప్రధాన బ్యాంకులు ఈ వడ్డీని అందిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు, సులభమైన యాక్సెస్, త్రైమాసిక వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. పన్ను మినహాయింపు (Section 80TTA) పోస్టాఫీస్, SBI సేవింగ్స్ ఖాతాలు Income Tax Act, 1961 సెక్షన్ 80TTA కింద కవర్ అవుతాయి. వ్యక్తులు HUFలు వార్షికం రూ.10,000 వరకు వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు బ్యాంకులు, పోస్టాఫీసులు, సహకార సంఘాల ఖాతాలకు వర్తిస్తుంది.
Details
ఏ పొదుపు ఖాతా ఎంచుకోవాలి?
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4% అధిక వడ్డీ, వార్షిక వడ్డీ క్రెడిట్, సాధారణ వడ్డీ లెక్కింపు. అధిక రాబడిని కోరే వ్యక్తులకు ఇది మంచిది. SBI సేవింగ్స్ ఖాతా: 2.5% వడ్డీ, డిజిటల్ ఫీచర్లు, త్రైమాసిక వడ్డీ చెల్లింపు, సౌకర్యవంతమైన యాక్సెస్. సౌకర్యం, డిజిటల్ సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తే ఇది ఉత్తమం. సారాంశంగా అధిక వడ్డీ కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సౌకర్యం కోసం SBI సేవింగ్స్ ఖాతా ఎంచుకోవచ్చు. రెండూ పన్ను మినహాయింపులకు అర్హం.