Loading...
RBI New Cheque Books 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్‌లు? క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్‌లు? క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

RBI New Cheque Books 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్‌లు? క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 1, 2027 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో చెక్‌బుక్‌లు వస్తాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెరదించింది. ప్రస్తుతం బ్యాంకులు వినియోగిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్‌బుక్‌లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. 2026 డిసెంబర్ 31 తర్వాత పాత చెక్‌బుక్‌లు పనిచేయవని, వాటి స్థానంలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో చెక్‌బుక్‌లు తీసుకువస్తారన్న సమాచారం వాస్తవం కాదని తెలిపింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తరించడంతో ఖాతాదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే అలాంటి కొత్త నిబంధనను ఆర్‌బీఐ ప్రకటించలేదని స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఉన్న చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది.

Details

అధికారిక ప్రకటనలనే నమ్మాలి

ఈ ప్రచారంపై ఆర్‌బీఐ తన అధికారిక X ఖాతాలో స్పందించింది.

డిసెంబర్ 31, 2026 తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న CTS చెక్‌బుక్‌ల ప్రమాణాలు మారుతాయని, జనవరి 1, 2027 నుంచి కొత్త భద్రతా ఫీచర్లతో కూడిన చెక్‌బుక్‌లు వస్తాయని కొన్ని సోషల్ మీడియా సందేశాలు చెబుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

అయితే ఈ సమాచారం వాస్తవంగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులను తాము ప్రకటించలేదని తెలిపింది.

అందువల్ల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌ల కోసం బ్యాంకులకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.

చెక్‌లు, బ్యాంకింగ్ నిబంధనలు లేదా ఖాతాలకు సంబంధించిన కీలక మార్పుల విషయంలో తప్పనిసరిగా అధికారిక ఆర్‌బీఐ లేదా సంబంధిత బ్యాంకు ప్రకటనలను పరిశీలించాలి.

Details

వ్యవసాయ రుణాలపై మాత్రం కొత్త ప్రతిపాదనలు

ఇదే సమయంలో వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసింది.

Priority Sector Lending (PSL) నిబంధనల్లో మార్పులతో పాటు వ్యవసాయ రుణాల డాక్యుమెంటేషన్‌ను మరింత కఠినతరం చేసే అంశాలను ముసాయిదా మార్గదర్శకాల్లో చేర్చింది.

2026కి సంబంధించిన Reserve Bank of India (Priority Sector Lending - Targets and Classification) Directions ముసాయిదాపై నవంబర్ 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనుంది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం బంగారం ఆధారంగా ఇచ్చే వ్యవసాయ రుణాలను పరిశీలించే సమయంలో సాగు భూమి ఉన్న ప్రాంతం, పండించే పంటలు, పంటలపై ఉన్న హైపోథికేషన్ వంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT