Page Loader
RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక
ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక

RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓటీపీలు,కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలను హెచ్చరించింది. ఆర్‌ బి ఐ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ అకౌంట్ లాగ్-ఇన్ వివరాలు, ఓటీపీలు, కేవైసీ సమాచారం లాంటి గోప్యమైన వివరాలను గుర్తు తెలియని వ్యక్తులకు పంచుకోవద్దని సూచించింది. మోసగాళ్లు ఆర్‌బీఐ పేరును ఉపయోగించి అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. నకిలీ లెటర్ హెడ్‌లు, నకిలీ ఈ-మెయిల్ అడ్రెస్‌లు వాడుతూ, ఆర్‌బీఐ ఉద్యోగుల పేరుతో లాటరీ, నిధుల బదిలీ, విదేశీ చెల్లింపులు, ప్రభుత్వ పథకాలు అంటూ మోసపూరిత ఆఫర్‌లు ఇస్తున్నారు.

వివరాలు 

ఖర్చుల పేరుతో బాధితుల నుంచి డబ్బు వసూలు

ఆ ఆఫర్‌లు పొందడానికి కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజు, ట్రాన్స్‌ఫర్, రెమిటెన్స్ వంటి ఖర్చుల పేరుతో బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు కూడా ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ అధికారుల పేరుతో మోసపాలవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారనీ, ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా వహించాలని ఆర్‌బీఐ హెచ్చరించింది.