LOADING...
Reliance Retail: జర్మనీకి చెందిన కోస్నోవా బ్యూటీతో రిలయన్స్ భాగస్వామ్యం
జర్మనీకి చెందిన కోస్నోవా బ్యూటీతో రిలయన్స్ భాగస్వామ్యం

Reliance Retail: జర్మనీకి చెందిన కోస్నోవా బ్యూటీతో రిలయన్స్ భాగస్వామ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వేగంగా పెరుగుతున్న బ్యూటీ రంగంలో తన స్థానం మరింత బలపడేలా చేసుకోవడానికి రిలయన్స్ రిటైల్ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. యూరప్‌లో అత్యధిక విక్రయాలు సాధిస్తున్న ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ 'ఎసెన్స్' ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ కాస్మెటిక్ దిగ్గజం 'కోస్నోవా బ్యూటీ' తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

రిలయన్స్ స్టోర్లు, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న బ్రాండ్ 

ఈ సహకారంతో తమ బ్యూటీ విభాగం మరింత విస్తరిస్తుందని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎసెన్స్‌కు చెందిన, నాణ్యతతో పాటు సరసమైన ధరల్లో లభించే, జంతువులపై పరీక్షలు చేయని (cruelty-free) మేకప్ ఉత్పత్తులను భారత వినియోగదారులకు అందించనున్నట్లు పేర్కొంది. రిలయన్స్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు, బ్యూటీ స్టోర్లు, అలాగే ఇతర భాగస్వామ్య రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఈ ఉత్పత్తులను విక్రయించనున్నారు. 2002లో జర్మనీలో ప్రారంభమైన ఎసెన్స్ బ్రాండ్ ప్రస్తుతం ప్రపంచంలోని 90 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్ ఉత్పత్తుల్లో 80 శాతం కంటే ఎక్కువ యూరప్ నుంచే తయారవుతున్నాయి. తాజా భాగస్వామ్యంతో గ్లోబల్ బ్రాండ్లను భారత వినియోగదారుల దరకే తీసుకురావాలన్న లక్ష్యాన్ని రిలయన్స్ రిటైల్ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.