Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.87శాతం ఉండగా, జులై నాటికి 7.44శాతానికి పెరిగింది. గత నెలలో కూరగాయల ధరలు, ముఖ్యంగా టమాట రేట్లు పెరుగుదలే రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) జూన్‌లో 4.49శాతం ఉండగా, జులైకి అది 11.51శాతానికి పెరిగింది. భారతదేశ గ్రామీణ ద్రవ్యోల్బణం జులైలో 4.78 శాతం నుంచి 7.63శాతానికి పెరిగింది. పట్టణ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.96 శాతం ఉండగా, జులై నాటికి 7.20 శాతానికి పెరిగింది.