Loading...
SBI: ఎస్‌బీఐ హెచ్చరిక... నంబర్‌ కోసం నెట్టింట సెర్చ్‌చేస్తే..ఖాతాఖాళీ
ఎస్‌బీఐ హెచ్చరిక... నంబర్‌ కోసం నెట్టింట సెర్చ్‌చేస్తే..ఖాతాఖాళీ

SBI: ఎస్‌బీఐ హెచ్చరిక... నంబర్‌ కోసం నెట్టింట సెర్చ్‌చేస్తే..ఖాతాఖాళీ

వ్రాసిన వారు Balachander Sharma
Oct 23, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. ఆన్‌లైన్‌లో కనిపించిన నంబర్‌కు ఫోన్‌ చేస్తే మీ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హెచ్చరించింది. నకిలీ హెల్ప్‌లైన్‌ నంబర్లతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Details

నకిలీ నంబర్లతో ఎలా మోసం చేస్తున్నారు?

బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసినప్పుడు మొదట కనిపించే ఫలితాల్లో కొన్ని నకిలీవి కావచ్చు.

బ్యాంకు పేరుతో వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ డైరెక్టరీలు, సోషల్‌ మీడియాల్లో నేరగాళ్లు తప్పుడు నంబర్లను ప్రచురిస్తున్నారు. వాటికి ఫోన్‌ చేసినప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకు ప్రతినిధిలా నమ్మించి, ఖాతా వివరాలు అడగవచ్చు.

మరికొందరు డబ్బు బదిలీ చేయాలని లేదా తెలియని యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒత్తిడి చేస్తారు.

Details

ఎస్‌బీఐ సూచిస్తున్న జాగ్రత్తలు

ఎస్‌బీఐ తన అక్టోబర్‌ 20, 2026 నాటి ఎక్స్‌ పోస్టులో భాగంగా 'నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ మంత్‌ స్పెషల్‌ క్యాంపెయిన్‌ 6.0' ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

కస్టమర్‌ కేర్‌ వివరాల కోసం సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లోని 'Contact Us' విభాగాన్ని మాత్రమే చూడాలని సూచించింది. ఎవరైనా ఫోన్‌ చేసి ఏటీఎం పిన్‌, సీవీవీ, ఓటీపీ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ అడిగితే చెప్పకూడదు.

బ్యాంకు ప్రతినిధులమని చెప్పినా ఈ వివరాలు పంచుకోవద్దు. ఖాతా మూసేస్తామని బెదిరించడం, తెలియని ఏపీకే ఫైల్‌ ఇన్‌స్టాల్‌ చేయమని చెప్పడం, వెంటనే డబ్బు పంపాలని ఒత్తిడి చేయడం వంటి సందర్భాల్లో కాల్‌ కట్‌ చేయాలి.

ADVERTISEMENT

Details

మోసం జరిగితే ఏం చేయాలి?

అనుమానాస్పద లావాదేవీ జరిగినా, మోసానికి గురయ్యామని తెలిసినా ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించాలి. జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలి. డిజిటల్‌ లావాదేవీల్లో వేగం ఎంత ముఖ్యమో, అప్రమత్తత కూడా అంతే ముఖ్యం.

ADVERTISEMENT