LOADING...
Phonepe IPO: ఫోన్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం.. పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమం
ఫోన్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం.. పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమం

Phonepe IPO: ఫోన్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం.. పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాల్‌మార్ట్‌ మద్దతుతో పనిచేస్తున్న ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌ పే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు కీలక అడుగు ముందుకు వేసింది. ఫోన్‌పే ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం. సెబీ సూచించిన మార్పులు, సవరణలతో అప్‌డేటెడ్‌ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీహెచ్‌ఆర్‌పీ)ను ఫోన్‌పే త్వరలోనే సమర్పించనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతోకాలంగాఎదురుచూస్తున్న ఫోన్‌పే ఐపీఓ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)రూపంలోనే జరగనుంది. అంటే ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను పబ్లిక్‌ ఇష్యూలో విక్రయించనున్నారు. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ ఉండదని తెలుస్తోంది. దీంతో ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి నేరుగా కొత్త నిధులు సమకూరవు.

Details

45 శాతం ఫోన్‌పే ద్వారానే లావాదేవీలు

ప్రస్తుతం దేశీయ డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో ఫోన్‌పేకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో సుమారు 45 శాతం ఫోన్‌పే ద్వారానే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం, 2025 డిసెంబర్‌ నెలలో మాత్రమే ఫోన్‌పే 9.8 బిలియన్‌ యూపీఐ లావాదేవీలను ప్రాసెస్‌ చేసింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఆదాయం రూ.7,115కోట్లకు చేరింది. ఫోన్‌పే ఐపీఓ పరిమాణం, ధరల శ్రేణి వంటి కీలక వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం, ఈ ఐపీఓ సైజ్‌ సుమారు రూ.12వేల కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. డిజిటల్‌ ఫిన్‌టెక్‌ రంగంలో ఇది ఒక కీలక పబ్లిక్‌ ఇష్యూగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement