Loading...
SEBI: సెబీ కీలక నిర్ణయం.. డిసెంబర్ 7 నుంచి స్టాక్ మార్కెట్‌లో కొత్త నిబంధనలు
సెబీ కీలక నిర్ణయం.. డిసెంబర్ 7 నుంచి స్టాక్ మార్కెట్‌లో కొత్త నిబంధనలు

SEBI: సెబీ కీలక నిర్ణయం.. డిసెంబర్ 7 నుంచి స్టాక్ మార్కెట్‌లో కొత్త నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌ (CAS)కు సంబంధించి తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. డెరివేటివ్స్ గడువు ముగిసే రోజున సెటిల్‌మెంట్ కోసం 30 నిమిషాల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్‌ (VWAP) విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో, క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సమయాన్ని మధ్యాహ్నం 3:30 నుంచి 3:40 గంటల వరకు మార్చనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆక్షన్ ఆధారిత సెటిల్‌మెంట్ విధానంతో షేర్ల ధరల్లో ఆకస్మిక హెచ్చుతగ్గులు వస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

డిసెంబర్ 7, 2026 నుంచి కొత్త నిబంధనలు

కొత్త మార్గదర్శకాల ప్రకారం, అన్ని ట్రేడింగ్ రోజుల్లో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మధ్యాహ్నం 3:30 నుంచి 3:40 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ మార్పులు 2026 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వస్తాయి.

అయితే, సాధారణ ట్రేడింగ్ సెషన్‌లో అమలు కాకుండా మిగిలిపోయిన లిమిట్ ఆర్డర్లు, ఐస్‌బర్గ్ ఆర్డర్లను కొత్త సెషన్‌కు బదిలీ చేసే నిబంధనలు మాత్రం 2027 ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు కొనసాగుతోంది.

వివరాలు 

కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లో కీలక మార్పులు

కొత్త విధానంలో మధ్యాహ్నం 3:30 నుంచి 3:31 గంటల వరకు ఒక నిమిషం పాటు రిఫరెన్స్ ధరను లెక్కించడంతోపాటు సెషన్ మార్పునకు సమయం కేటాయిస్తారు.

3:31 నుంచి 3:36 గంటల వరకు లిమిట్ ఆర్డర్లు, మార్కెట్ ఆర్డర్లకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ ఆర్డర్లను స్వీకరించరు.

వాటిని సవరించడానికి లేదా రద్దు చేయడానికి కూడా అవకాశం ఉండదు. లిమిట్ ఆర్డర్లను మాత్రం స్వీకరిస్తారు.

ఈ సెషన్ ముగింపు సమయం 3:38 నుంచి 3:40 గంటల మధ్య యాదృచ్ఛికంగా నిర్ణయిస్తారు. అనంతరం ఆర్డర్ల సరిపోలిక ప్రక్రియ జరుగుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

డెరివేటివ్స్, నగదు మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో మార్పులు

సెబీ సర్క్యులర్ ప్రకారం, సాధారణ ట్రేడింగ్ రోజుల్లో ఇండెక్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:45 గంటల వరకు కొనసాగుతుంది.

అయితే, గడువు ముగిసే రోజుల్లో ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ట్రేడింగ్ మధ్యాహ్నం 3:30 గంటలకే నిలిచిపోతుంది.

స్టాక్ డెరివేటివ్స్ ట్రేడింగ్ మాత్రం గడువు ముగిసే రోజుల్లోనూ 3:45 గంటల వరకు కొనసాగుతుంది.

నగదు మార్కెట్‌లో క్లోజింగ్ తర్వాత జరిగే ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 3:50 నుంచి 4:00 గంటల వరకు ఉంటుంది.

ఈ సమయంలో లావాదేవీలు ముగింపు ధరల ఆధారంగా జరుగుతాయి.

ADVERTISEMENT

వివరాలు 

రిఫరెన్స్ ధరను ఎలా లెక్కిస్తారు?

సాధారణ ట్రేడింగ్ సెషన్‌లో చివరి 30 నిమిషాల సమయంలో సంబంధిత ఇండెక్స్‌లోని షేర్ల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ధరల (VWAP) ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇండెక్స్ సూచనాత్మక విలువను రియల్‌టైమ్‌లో లెక్కించి వెల్లడిస్తాయి.

క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌కు సంబంధించిన రిఫరెన్స్ ధరను మాత్రం సాధారణ ట్రేడింగ్ సెషన్‌లో చివరి 15 నిమిషాల్లో జరిగిన లావాదేవీల VWAP ఆధారంగా నిర్ణయిస్తారు.

ట్రేడింగ్ జరగని సమయాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా వర్తిస్తాయి.

వివరాలు 

సర్క్యులర్‌లోని ఇతర ముఖ్యమైన నిబంధనలు

మధ్యాహ్నం 3:30 నుంచి 3:45 గంటల మధ్య స్టాక్ ఫ్యూచర్స్‌కు వర్తించే ధర పరిమితులను క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ధర పరిమితులతో అనుసంధానిస్తారు.

ఈ సమయంలో ధర పరిమితులను డైనమిక్‌గా మార్చరు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లోని ఆర్డర్లకు సాధారణంగా వర్తించే మార్జిన్ నిబంధనలు వర్తిస్తాయి.

అయితే, సాధారణ ట్రేడింగ్ సెషన్ నుంచి బదిలీ అయ్యే అర్హత కలిగిన ఆర్డర్లకు కొన్ని మినహాయింపులు ఉంటాయి.

అమలు కాని లిమిట్ ఆర్డర్లను సాధారణంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌కు బదిలీ చేస్తారు.

అయితే, స్టాప్‌లాస్ ఆర్డర్లు, నిర్ణయించిన ధర పరిమితులకు వెలుపల ఉన్న ఆర్డర్లకు ఈ నిబంధన వర్తించదు.

వివరాలు 

సెబీ నిర్ణయాన్ని స్వాగతించిన మార్కెట్ వర్గాలు

సెబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్కెట్ వర్గాలు స్వాగతించాయి.

బీసీబీ బ్రోకరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తమ్ బాగ్రి మాట్లాడుతూ.. ఈక్విటీ డెరివేటివ్స్ సెటిల్‌మెంట్‌ను క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లో ధరల నిర్ణయ ప్రక్రియ నుంచి వేరు చేయడం మార్కెట్‌లోని భాగస్వాములకు ఇబ్బందిని కలిగిస్తున్న ప్రధాన సమస్యను తొలగిస్తుందని తెలిపారు.

మార్కెట్ కార్యకలాపాలు మరింత సజావుగా సాగేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గతంలో మాదిరిగా నగదు మార్కెట్ ట్రేడింగ్ వేళలను మధ్యాహ్నం 3:30 గంటల వరకు పునరుద్ధరించడాన్ని కూడా ఆయన స్వాగతించారు.

ADVERTISEMENT