Stock market: వరుసగా రెండో రోజు నష్టాలు: రిలయన్స్, ట్రెంట్ అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ, అమెరికా నుంచి కొత్త టారిఫ్‌లపై ఉన్న భయాలు దేశీయ మార్కెట్లను వెంటాడాయి. ప్రధానంగా రిలయన్స్, ట్రెంట్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలపై ఒత్తిడి పెరిగింది. ఆంక్షల మధ్య రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నట్లు రిలయన్స్‌పై వచ్చిన కథనాలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి. ఈ వార్తలు అవాస్తవమని రిలయన్స్ స్పష్టంగా ఖండించినప్పటికీ ఇంట్రాడేలో షేర్లు దాదాపు 5 శాతం వరకు పడిపోయాయి. చివరికి 4.39 శాతం నష్టంతో రూ.1,508.90 వద్ద రిలయన్స్ ముగిసింది.
Details
భారీగా పడిపోయిన ట్రెంట్ షేర్లు
ఇక క్యూ3 ఆదాయ అంచనాలను అందుకోలేకపోవడంతో ట్రెంట్ షేర్లు భారీగా పడిపోయాయి. ట్రెంట్ షేర్ 8.46 శాతం నష్టపోయి రూ.4,055 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 85,331.14 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 85,439.62) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నెగటివ్ ట్రెండ్‌లోనే కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 84,900 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 376.29 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 71.60 పాయింట్లు కోల్పోయి 26,178.79 వద్ద ముగిసింది. కరెన్సీ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 90.16గా నమోదైంది.
Details
బంగారం ఔన్సు ధర 4,449 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 61.84 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు ధర 4,449 డాలర్ల వద్ద . సెన్సెక్స్ టాప్ లూజర్స్: ట్రెంట్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టీసీఎస్