Loading...
Stock Market: సెన్సెక్స్‌ 685 పాయింట్లు జంప్‌.. నిఫ్టీ 22,776 వద్ద ముగింపు!
సెన్సెక్స్‌ 685 పాయింట్లు జంప్‌.. నిఫ్టీ 22,776 వద్ద ముగింపు!

Stock Market: సెన్సెక్స్‌ 685 పాయింట్లు జంప్‌.. నిఫ్టీ 22,776 వద్ద ముగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపడంతో పాటు.. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో వరుసగా రెండో సెషన్‌లోనూ సూచీలు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,508.05 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సోమవారం 72,382.47 వద్ద ముగిసిన ఈ సూచీ.. రోజంతా లాభాల్లోనే కదలాడింది. చివరకు 685.34 పాయింట్లు లాభపడి 73,067.81 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాలను నమోదు చేసింది. 220.35 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 22,776.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 96.43గా ఉంది.

వివరాలు

లాభాల్లో కొన్ని.. నష్టాల్లో మరికొన్ని

సెన్సెక్స్‌ 30లో ట్రెంట్‌, కోటక్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, రిలయన్స్‌, ఇండిగో, ఎటర్నల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

మరోవైపు టెక్‌ మహీంద్రా, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 98.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ఔన్స్‌ ధర 4,151.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT