Comrade Kalyan: శ్రీవిష్ణు అభిమానులకు గుడ్‌న్యూస్.. 'కామ్రేడ్ కల్యాణ్' ట్రైలర్ విడుదల!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 06, 2026
04:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్ (Mahima Nambiar) కథానాయికగా నటిస్తున్నారు. కోన వెంకట్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జానకీరామ్ మారెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబరు 9న 'కామ్రేడ్ కల్యాణ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా 9 మంది దర్శకుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం.