Loading...
Andhra Pradesh: పాక్‌కు రక్షణ రహస్యాల చేరవేత.. ఏపీలో బయటపడిన గూఢచర్య నెట్‌వర్క్
పాక్‌కు రక్షణ రహస్యాల చేరవేత.. ఏపీలో బయటపడిన గూఢచర్య నెట్‌వర్క్

Andhra Pradesh: పాక్‌కు రక్షణ రహస్యాల చేరవేత.. ఏపీలో బయటపడిన గూఢచర్య నెట్‌వర్క్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో గూఢచర్య వ్యవహారం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌కు రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్‌ను ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (ఏపీ సీఐ) ఛేదించింది. 'ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌-2026' పేరుతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 18 మందిపై నిఘా ఈ గూఢచర్య నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం 18 మంది వ్యక్తుల కదలికలపై ఏపీ సీఐ అధికారులు నిఘా పెట్టారు. వీరిలో 13 మంది నావికాదళ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. అత్యంత రహస్యంగా వ్యూహాన్ని అమలు చేసిన అధికారులు.. ఈ నెల 1న ఆపరేషన్‌ను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 12 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో దాడులు చేపట్టారు.

వివరాలు 

10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు

ఆపరేషన్‌లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

పలు ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

తదుపరి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఏపీ సీఐ అధికారులు గుర్తించారు.

నేవీ సిబ్బందితో పాక్ ఏజెంట్ల రహస్య సంబంధాలు

దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లతో కొంతమంది నేవీ సిబ్బందికి రహస్య సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.

విశాఖపట్నం కేంద్రంగా ఈ గూఢచర్య కార్యకలాపాలు కొనసాగినట్లు ఏపీ సీఐ సెల్‌ గుర్తించింది.

రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి శత్రు దేశానికి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.

వివరాలు 

ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌తో సమాచారం చేరవేత

సేకరించిన సమాచారాన్ని సాధారణ కమ్యూనికేషన్‌ మార్గాల్లో కాకుండా ఎన్‌క్రిప్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఈ నెట్‌వర్క్‌ ఎలా పనిచేసింది, ఎలాంటి సమాచారం బదిలీ అయింది, ఇందులో మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మూడు కేసులు నమోదు

ఈ వ్యవహారంపై విజయవాడలోని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేశారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్లు 61(2), 147, 148 రెడ్‌విత్‌ 3(5) కింద కేసులు నమోదయ్యాయి.

అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్లు 17, 18 కింద కూడా కేసు నమోదు చేశారు.

అదేవిధంగా అధికారిక రహస్యాల చట్టం-1923లోని సంబంధిత సెక్షన్‌ కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గూఢచర్య నెట్‌వర్క్‌ పరిధి, ఇందులో భాగమైన వ్యక్తులు, రక్షణ సమాచార బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ADVERTISEMENT