Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్ష నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ ఈ రోజు ప్రకటించనున్న కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీని ప్రభావంతో మార్కెట్ సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 57.44 పాయింట్లు కోల్పోయి 78,000.72 వద్ద, నిఫ్టీ (Nifty) 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి.
వివరాలు
మిశ్రమంగా కడుకుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.57గా ఉంది. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు మంచి ప్రదర్శన చూపుతున్నాయి.
ఓఎన్జీసీ, ఎస్‌బీఐ, హిందుస్థాన్ యునీలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ స్థిరంగా ఉండగా, జపాన్ నిక్కీ 0.44 శాతం, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 0.17 శాతం నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ మాత్రం 0.6 శాతం లాభంతో కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం బలంగా వ్యాపారం చేశాయి, ఎస్‌అండ్‌పీ సూచీ 0.36 శాతం, నాస్‌డాక్ 0.51 శాతం, డోజోన్స్ 0.28 శాతం మేర లాభపడ్డాయి.