LOADING...
Software engineer: 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు ఉద్యోగం పోయి.. ఆహారశాలలో చేరిన టెకీ!

Software engineer: 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు ఉద్యోగం పోయి.. ఆహారశాలలో చేరిన టెకీ!

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగ భద్రతపై భయాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా, అనుభవజ్ఞుడైన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ కృత్రిమ మేధ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయిన విషయాన్ని వెల్లడించగా,ఆ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఏఐ కారణంగా ఎనిమిది నెలల క్రితమే ఉద్యోగం కోల్పోయానంటూ ఆ వ్యక్తి తన పోస్టులో పేర్కొన్నాడు. తాను పనిచేసిన బృందంలో మొత్తం పన్నెండు మంది సాంకేతిక నిపుణులు ఉండేవారని, కానీ సంస్థ వారందరినీ తొలగించి కేవలం ఇద్దరు కృత్రిమ మేధ నిపుణులను మాత్రమే నియమించుకుందని వివరించాడు. ఆ తరువాత వందకు పైగా అవకాశాలకు దరఖాస్తు చేసినప్పటికీ సరైన పని దొరకలేదని పేర్కొన్నాడు.

వివరాలు 

 భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన నెటిజన్లు  

కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు ఆహార సరఫరా సంస్థలో పని చేయాల్సి వచ్చిందని తెలిపాడు. తనకు పరిచయమైన అనేక మంది అనుభవజ్ఞులైన ఇంజినీర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారిలో కొందరు తమ రంగానికి సంబంధంలేని పనుల్లో చేరాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుంటూ స్పందిస్తుండగా, మరికొందరు అనుభవం ఉన్న వారు కృత్రిమ మేధ సాధనాలను నేర్చుకుంటే కొత్త అవకాశాలు పెరుగుతాయని సూచిస్తున్నారు.

Advertisement