
Stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్, చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారిపోయింది.
ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ కొంత కొనుగోళ్ల మద్దతు పొందగా, మెటల్, పీఎస్‌యూ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
బుధవారం క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లు సెలవు దినంగా ఉండగా, గురువారం తిరిగి తెరుచుకుంటాయి.
సెన్సెక్స్ ఉదయం 78,707.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం వరకు లాభాల్లోనే నిలిచింది.
ఇంట్రాడేలో గరిష్ఠంగా 78,877.36 పాయింట్లను చేరిన సూచీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో 67.30 పాయింట్ల నష్టంతో 78,472.87 వద్ద ముగిసింది.
వివరాలు
బంగారం ఔన్సు 2631 డాలర్లు
నిఫ్టీ 25.80 పాయింట్ల నష్టంతో 23,727.65 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో మరో 9 పైసలు తగ్గి 85.20 ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది.
ఇది డాలరు బలపడడం, దేశీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా చోటుచేసుకున్నట్లు అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభపడగా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.17 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2631 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.