Loading...
Stock market: స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్.. రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగిన మదుపర్ల సంపద
స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్.. రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగిన మదుపర్ల సంపద

Stock market: స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్.. రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగిన మదుపర్ల సంపద

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీలు 1.3 శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 23,400 మార్కును దాటింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. సెన్సెక్స్‌ గత ముగింపు 74,459.53 పాయింట్లతో పోలిస్తే.. సోమవారం ఉదయం 75,178.24 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో అధిక లాభాల్లో కొనసాగింది. చివరికి 1,233.25 పాయింట్లు పెరిగి 75,692.78 పాయింట్ల వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 101.82 డాలర్లు 

నిఫ్టీ 387.70 పాయింట్లు లాభపడి 23,440.80 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.90గా నమోదైంది.

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

మరోవైపు ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 101.82 డాలర్ల వద్ద కొనసాగింది. బంగారం ఔన్స్ ధర 3,897 డాలర్ల వద్ద ట్రేడైంది.

వివరాలు 

కారణాలివీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఆ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సోమవారం రిలయన్స్ షేర్లు దాదాపు 7 శాతం పెరిగాయి. ఈ పరిణామం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేసింది.

ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం క్షీణించి 110 డాలర్లకు చేరింది. చమురు ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

కారణాలివీ..

విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) తిరిగి కొనుగోళ్ల బాట పట్టడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. శుక్రవారం ట్రేడింగ్‌లో వారు దాదాపు రూ.3,598.54 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపించింది. దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ట్రేడవడం దేశీయ మార్కెట్లకు మరింత బలాన్నిచ్చింది.

ADVERTISEMENT